స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ‘బాహుబలి’ పూర్వ కథతో ఓ భారీ వెబ్ సిరీస్ తీయాలని కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’లో బాగా హైలైట్ అయిన శివగామి పాత్రను ఆధారంగా చేసుకుని రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ ఆధారంగా ఈ సిరీస్ తీయాలని నాలుగేళ్ల కిందట సన్నాహాలు మొదలుపెట్టింది. కానీ ఒక పట్టాన ఈ సిరీస్ పట్టాలెక్కలేదు.
ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా ఈ ప్రాజెక్టు కోసం కొంత కాలం పని చేసి బయటికి వచ్చేశారు. తర్వాత వేరే టీంను పెట్టుకుని సరికొత్తగా బాహుబలి సిరీస్ తీయడానికి సిద్ధమవుతోంది నెట్ ఫ్లిక్స్. ఐతే ఇందులో కీలకమైన శివగామి పాత్రకు ‘భలే మంచి రోజు’ ఫేమ్ వామికా గబ్బి ఎంపికైనట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అంత కీలకమైన పాత్రకు వామిక ఎలా సూటవుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి జనాల నుంచి. ఇలాంటి కాస్టింగ్‌తో ఈ సిరీస్‌కు ఏం ఊపు వస్తుందో అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి.
ఐతే ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తీసుకొచ్చే అప్‌డేట్ బయటికి వచ్చిందిప్పుడు. నెట్‌ఫ్లిక్స్ వారి బాహుబలి సిరీస్ కోసం సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతారను ఎంచుకున్నారట. ఆమె పాత్ర ఏంటి అన్నది వెల్లడి కాలేదు కానీ.. ఈ ప్రాజెక్టుకు నయన్ సంతకం చేయడం మాత్రం నిజమట. మరి దేవసేన పాత్రనేమైనా ఆమె చేయనుందా.. లేక కొత్త పాత్ర ఏదైనా ఆమెకు ఇస్తున్నారా అన్నది తెలియడం లేదు.
నిజానికి నెట్‌ఫ్లిక్స్ తీస్తున్న సిరీస్‌లో శివగామిదే అత్యంత కీలకమైన పాత్ర. ఆ పాత్రనే నయన్‌కు ఇస్తే ఈ సిరీస్ రేంజే వేరుగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నయన్‌తో పాటు మరికొందరు పేరున్న తారాగణాన్ని తీసుకొచ్చి, నెట్ ఫ్లిక్స్ స్థాయికి తగ్గట్లు ఈ సిరీస్‌ను తీర్చిదిద్దితే.. ఇది ఇండియన్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ సిరీస్ దర్శకత్వ బాధ్యతలను ఇద్దరు యంగ్ బాలీవుడ్ ఫిలిం మేకర్స్ చేతికి అప్పగించినట్లు తెలుస్తోంది.
This post was last modified on July 16, 2021 10:23 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…