దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పతనానికి పునాది పడ్డ చిత్రాల్లో ఒకటిగా ‘ఐస్ క్రీమ్’ను చెబుతారు చాలామంది. అంతకుముందే ఆయన స్థాయి పడిపోయింది కానీ.. మరీ పేలవంగా అయితే ఉండేవి కావు ఆయన చిత్రాలు. కచ్చితంగా ఎంతో కొంత ఎఫర్ట్ కనిపించేది. ఫ్లాప్ సినిమాల్లో కూడా వర్మ ముద్ర ఉండేది. ‘ఐస్ క్రీమ్’ మాత్రం అలా కాదు.
ఏమాత్రం శ్రద్ధ లేకుండా.. ఏం తోస్తే అది తీసినట్లుగా.. మరీ సిల్లీగా కనిపిస్తుందా చిత్రం. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటున్న తేజస్వి మదివాడ ఈ సినిమాతోనే కథానాయిక అయింది. నవదీప్ ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు.
తేజస్వి అందాలను హైలైట్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రోమోలు కొంత మేర యువతనకు ఆకర్షించి దీనికి ఓపెనింగ్స్ వచ్చాయి. మరీ తక్కువ ఖర్చుతో డిజిటల్ కెమెరాతో సినిమా తీయడం ద్వారా మాత్రం వర్మ యంగ్ ఫిలిం మేకర్లకు స్ఫూర్తినిచ్చాడు. అంతకుమించి ‘ఐస్ క్రీమ్’ గురించి చెప్పడానికి ఏమీ లేదు.
‘ఐస్ క్రీమ్’ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా.. వర్మ దీనికి సీక్వెల్ తీయడం తెలిసిందే. అందులో జేడీ చక్రవర్తి, మృదుల భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది మరీ దారుణ ఫలితాన్నందుకుంది. వర్మ ఆ తర్వాత ఇంకా స్థాయి తక్కువ సినిమాలు ఎన్నో తీశాడు. ఈ మధ్య జనాలు ఆయన్ని అస్సలు పట్టించుకోని సంగతి తెలిసిందే.
వర్మ సినిమాలు విడుదలవుతున్నాయి. వెళ్లిపోతున్నాయి. అయినా సరే సినిమాలు తీయడం మాత్రం మానట్లేదు. ఇప్పుడు ‘ఐస్ క్రీమ్’ సిరీస్‌లో కొత్త సినిమా తీయడానికి ఆయన రెడీ అయిపోయారు.
ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్-2 చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణనే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయనున్నాడట. వర్మతో కాస్త పేరున్న హీరోయిన్లెవరూ సినిమా చేసే పరిస్థితి లేదు. ‘ఐస్ క్రీమ్-3’కి ఇంకో కొత్త ఫేస్‌ను పట్టుకురావడం ఖాయం. మరి ఈ సినిమాతో ఏమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాడో చూడాలి.
This post was last modified on July 16, 2021 5:19 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…