దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడి ఉన్నప్పటికీ.. కొత్త సినిమాల విడుదల ఏమీ ఆగట్లేదు. తెలుగులో తక్కువే కానీ.. వేరే భాషల్లో ఓటీటీల ద్వారా కొత్త చిత్రాలు బాగానే రిలీజవుతున్నాయి. కొన్ని చిత్రాలకు మంచి హైప్ కూడా వస్తోంది.
అందులో ఒకటి మలయాళ చిత్రం.. మాలిక్. గత దశాబ్ద కాలంలో దేశంలోనే అత్యుత్తమ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఫాహద్ ఫాజిల్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ‘విశ్వరూపం’ సహా ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసి గత ఏడాదే.. ‘సీ యూ సూన్’ అనే వెరైటీ సినిమాతో దర్శకుడిగా మారిన మహేష్ నారాయణన్ దీనికి దర్శకుడు.
ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ నిన్న రాత్రి 10 గంటలకు రిలీజ్ చేసింది. ట్రైలర్ చూసి ఫాహద్ కెరీర్లో మరో మేటి చిత్రం అవుతుందన్న అంచనాలు కలిగాయి. సినిమా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు చూసిన వాళ్లందరూ.
ఇటు క్రిటిక్స్ ఇస్తున్న రివ్యూలు.. అటు నెటిజన్లు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తుంటే.. ఈ ఏడాది ఇండియాలో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్‌లో ‘మాలిక్’ ఒకటి అని అర్థమవుతోంది. గత కొన్నేళ్లలో ఓటీటీల విప్లవం కారణంగా మలయాళ సినిమాలను ఇతర భాషల వాళ్లూ విరగబడి చూస్తున్నారు. ఫాహద్ ఎంత గొప్ప నటుడో అందరికీ బాగానే అర్థమైంది.
అతను ఓ సినిమాలో నటించాడంటే అది స్పెషల్‌గానే ఉంటుందని, సినిమా అటు ఇటుగా ఉన్నా ఫాహద్ పెర్ఫామెన్స్ కోసమే సినిమా చూడొచ్చనే నమ్మకంతో ఉన్నారు. ‘మాలిక్’లో అతడి పెర్ఫామెన్స్‌ను కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్‌గా చెబుతున్నారు.
డిఫరెంట్ షేడ్స్, లుక్స్ ఉన్న క్యారెక్టర్లో ఫాహద్ పెర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. ‘గాడ్ ఫాదర్’ స్టయిల్లో సినిమాను కూడా ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడట మహేష్ నారాయణన్. ఈ ఏడాది మస్ట్ వాచ్ సినిమాల్లో ఇదొకటని తీర్మించేస్తున్నారు అందరూ.
This post was last modified on July 15, 2021 4:25 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…