రాజమౌళి ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్ అంటే అతిశయోక్తి ఏమీ కాదు. రాజమౌళి కంటే గొప్పగా సినిమాలను డీల్ చేసేవాళ్లు, కొత్తదనం పంచేవాల్లు, ఉన్నతమైన కథలను తెరకెక్కించే వాళ్లు ఉండొచ్చు. కానీ మెజారిటీ ప్రేక్షకులను అలరించే సినిమాలు తీయడంలో జక్కన్న మిగతా దర్శకులందరి కంటే ముందుంటాడు.
‘బాహుబలి’తో అతడి సత్తా ఏంటో దేశం మొత్తానికి తెలిసింది. ఇప్పుడు జక్కన్న తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’పై అంచనాలు మామూలుగా లేవు. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో ఆ అంచనాలను రెట్టింపు చేసింది.
నిజానికి ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ఉత్తరాదిన పెద్దగా గుర్తింపు లేదు. డబ్బింగ్ సినిమాలతో ఏదో కాస్త పాపులర్ అయి ఉండొచ్చు కానీ.. వాళ్లను చూసి మిగతా భాషల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చుట్టూ ఇంత హైప్ నెలకొందంటే.. భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారంటే అది రాజమౌళి వల్లే.
ఐతే తనకున్న క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి, బ్రాండ్‌ను బిల్డ్ చేసుకోవడానికి రాజమౌళి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో హీరోలను మించి జక్కన్నే హైలైట్ కావడం, ఆయనకే అదిరిపోయే ఎలివేషన్లు ఇవ్వడం విశేషం. ఈ వీడియో మొదలైందే రాజమౌళి మీద తీసిన విజువల్స్‌తో. లొకేషన్లో జక్కన్న షార్ప్ లుక్స్, హావభావాలతో ఉన్న షాట్స్ తీసి వాటితోనే మేకింగ్ వీడియోను మొదలుపెట్టారు.
ఈ వీడియోలో ఆద్యంతం జక్కన్న హైలైట్ అవుతూనే వెళ్లాడు. హీరోలేమో పక్కకు వెళ్లిపోయారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా.. మాస్టర్ స్టోరీ టెల్లర్ అంటూ ఆయనకు ఓ రేంజిలో ఎలివేషన్లు ఇచ్చారు. ఐతే ఇవేవీ అతిశయోక్తుల్లా కనిపించలేదు. జక్కన్న ఈ హైప్‌కు, ఎలివేషన్లకు కచ్చితంగా అర్హుడనడంలో సందేహం లేదు.
ఆయన పేరు మీదే ప్రమోషన్లు గట్టిగా చేసి సినిమా మీద అంచనాలు మరింత పెంచాలని చిత్ర బృందం డిసైడైనట్లు ఉంది. జక్కన్న కూడా తనకీ ప్రమోషన్ అవసరమనే గుర్తించినట్లున్నాడు. తన బ్రాండ్‌ను బిల్డ్ చేసుకోవడంపై ఆయన దృష్టిసారించినట్లున్నాడు.
This post was last modified on July 15, 2021 4:22 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…