సినిమా ఇండస్ట్రీలో పని చేసే చాలా మందికి నిర్మాతలుగా మారాలని ఉంటుంది. కొందరు రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతుంటారు. కానీ సినిమా సినిమాకి భారీ రెమ్యునరేషన్లు తీసుకునే హీరో, హీరోయిన్లు మాత్రం మనకెందుకులే అనుకుంటారు. ముఖ్యంగా నిర్మాతలుగా మారిన హీరోయిన్లను చేతివేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.
అయితే ఈ మధ్యకాలంలో మాత్రం హీరోయిన్లు కూడా సినిమాలపై పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ లాంటి హీరోయిన్లు సైతం నిర్మాతలుగా మారారు.
ఇప్పుడు తాప్సీ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితుడు ప్రాంజల్ తో కలిసి ‘అవుట్ సైడర్స్’ అనే సంస్థను స్థాపించారు. త్వరలోనే ఈ సంస్థపై ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అయితే ఇందులో ఎవరెవరు నటిస్తారు..? ఏ భాషలో సినిమాను నిర్మించబోతున్నారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు తాప్సీ తన బ్యానర్ కు పెట్టిన పేరు హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. బయటవాళ్లకు అవకాశాలు పెద్దగా ఇవ్వరని.. సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వారినే అందలం ఎక్కిస్తారని విమర్శలు వస్తుంటాయి. అందుకే తాప్సీ అవుట్ సైడర్ అనే పేరుని ఎన్నుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక తాప్సీ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. ఇటీవల ఆమె నటించిన ‘హసీనా దిల్ రూబా’ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో నటిస్తోంది.
This post was last modified on July 15, 2021 1:15 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…