టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన రాశిఖన్నా.. స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఆమెకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో కలిసి ‘థాంక్యూ’, అలానే గోపీచంద్ తో కలిసి ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాల్లో నటిస్తోంది. మరోపక్క తమిళంలో ఐదు సినిమాలు చేస్తోంది. అలానే మలయాళంలో ‘భ్రమమ్’ అనే సినిమాను పూర్తి చేసింది. వరుసగా సినిమాలు చేయడంతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్లాన్ చేస్తోంది ఈ బ్యూటీ.
ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే రూపొందిస్తోన్న కొత్త సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో షాహిద్ కపూర్ సరసన రాశిఖన్నా కనిపించబోతుంది. తాజాగా ఆమె లీడ్ రోల్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు రాశి కమర్షియల్ హీరోయిన్ పాత్రల్లోనే కనిపించింది. కానీ తొలిసారి ఆమె చుట్టూనే తిరిగే కథ రాసుకున్నారట.
సురేష్ వంగ అనే నూతన దర్శకుడు ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశారు. క్రైమ్, యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా రాశిఖన్నాను తీసుకున్నారు. ఇందులో ఆమె స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ఈ సిరీస్ లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించిన రవీంద్ర విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘నవంబర్ స్టోరీ’ సిరీస్ కి సినిమాటోగ్రఫీ అందించిన విధు ఈ సిరీస్ కు వర్క్ చేయనున్నారు. అండ్ స్టోరీస్ సంస్థ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించబోతోంది. సోనీ ఓటీటీలో ఈ సిరీస్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
This post was last modified on July 14, 2021 9:58 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…