మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ముందుగా టాప్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లను తీసుకున్నారు. గతంలో ఆయన ఎన్నో హిట్టు సినిమాలకు పని చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, ‘కాటమరాయుడు’ లాంటి సినిమాలకు సైతం ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఆ బంధంతోనే మరోసారి పవన్ సినిమా కోసం ఆయన్ను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
కారణం ఏంటనేది క్లారిటీ లేనప్పటికీ.. ఆయన తప్పుకున్నారనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ను తీసుకున్నట్లు సమాచారం. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలకు పని చేసిన రవిచంద్రన్ ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు రెండో సినిమాగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ రావడం విశేషం. మరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి!
This post was last modified on July 14, 2021 12:13 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…