మహేష్ బాబు మూవీ ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’లోనూ నటించింది. కానీ ఈ రెండు చిత్రాలూ డిజాస్టర్లవడంతో తెలుగులో ఆమె కెరీర్ ముందుకు సాగలేదు. కానీ హిందీ మంచి మంచి అవకాశాలందుకుని అక్కడ సెటిలైపోయింది కృతి.
ప్రస్తుతం ‘ఆదిపురుష్’ లాంటి భారీ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది కృతి. దాని కంటే ముందు కృతి నటించిన ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆ చిత్రమే.. మిమి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఆద్యంతం హిలేరియస్‌గా ఉండి.. ఇన్‌స్టంట్‌గా ప్రేక్షకులకు ఎక్కేస్తోంది. ‘మిమి’ సరోగసీ (అద్దె గర్భం) చుట్టూ నడిచే సినిమా కావడం విశేషం.
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ భలే పాయింట్ పట్టుకుని ఆద్యంతం సినిమాను వినోదాత్మకంగా నడిపిించినట్లున్నాడు. ‘మిమి’ కథ విషయానికి వస్తే.. డబ్బు మీద బాగా ఆశ ఉన్న ఒక మధ్య తరగతి అమ్మాయి ముందుకు ఒక ప్రపోజల్ వస్తుంది. ఒక విదేశీ జంట కోసం ఆమె సరోగసీ ద్వారా బిడ్డను కంటే రూ.20 లక్షలు చెల్లిస్తారన్నదే ఆ ప్రపోజల్.
కొన్ని నెలల పాటు తల్లిదండ్రులకు కూడా కనిపించకుండా వేరే చోట ఉండి ఆ బిడ్డను కనేసి రూ.20 లక్షలు తీసుకుని హ్యాపీగా ఉండాలన్నది ఆ అమ్మాయి ప్లాన్. రెండు మూడు నెలల వరకు ఇంట్లోనే మేనేజ్ చేసి.. తర్వాత డెలివరీ అయ్యే వరకు తన దగ్గరికి ఈ ప్రపోజల్ తెచ్చిన వ్యక్తి ఇంట్లోనే ఉండాలని అనుకుంటుంది.
విదేశీ జంటకు.. కృతికి మధ్యవర్తిత్వం చేసే వ్యక్తి పంకజ్ త్రిపాఠి నటించాడు. కృతికి, అతడికి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గర్భం దాలిస్తే ఫిగర్ పాడవుతుందా అని డాక్టర్ని కృతి అడగడం.. సరోగసీ ద్వారా బిడ్డను కన్న శిల్పా శెట్టి బాగానే ఉందిగా అంటూ డాక్టర్ చెప్పడం లాంటి సీన్లు ఆకట్టుకుంటున్నాయి.
కృతి డెలివరీకి రెడీ అవుతున్న టైంలో విదేశీ జంట తమకు బిడ్డ వద్దని చెప్పడం ఇందులో ట్విస్ట్. ఇక్కడ కొంచెం కథ ఎమోషనల్ టర్న్ తీసుకునేలా ఉంది. కానీ తర్వాతి సన్నివేశాలు, ముగింపు కూడా హిలేరియస్‌గా ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్లో లాస్ట్ సీన్ హైలైట్‌గా నిలిచింది. ట్రైలర్ చూస్తే సినిమా స్యూర్ షాట్ హిట్ అనిపిస్తోంది.
This post was last modified on July 13, 2021 4:17 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…