తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత రచయితగా మారి.. చివరగా దర్శకుడి అవతారం ఎత్తాడు హర్షవర్ధన్. అతడిలో ఒక రచయిత.. దర్శకుడు ఉన్నాడని చాలా కాలం వరకు తెలియలేదు. బుల్లితెరపై.. వెండి తెరపై చాలా కాలం నటుడిగానే ఉండిపోయాడతను. ఆపై ‘అమృతం’ సీరియల్లో కొన్ని ఎపిసోడ్లు డైరెక్ట్ చేయడం.. రచనలోనూ పాలుపంచుకోవడం ద్వారా తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తర్వాత ‘ఇష్క్’.. ‘గుండె జారి గల్లంతయ్యిందే’.. ‘మనం’ లాంటి సినిమాలతో రైటర్ గా తన బలాన్ని చూపించాడు.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాతో అతను దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రం నాలుగేళ్ల ముందే పూర్తయింది. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించి ఒక వెరైటీ ట్రైలర్ కూడా వదిలాడు హర్ష. మధ్యలో ‘గూగ్లీ’ అంటూ ఈ సినిమాకు టైటిల్ కూడా మార్చి విడుదలకు సన్నాహాలు చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయింది.
ఈ చిత్రం గురించి హర్ష కూడా మాట్లాడట్లేదు రెండేళ్లుగా. ఒకప్పట్లాగే నటుడిగా కొనసాగుతున్న అతను.. ఎట్టకేలకు మళ్లీ తన క్రియేటివ్ టాలెంట్ చూపించడానికి సిద్ధమయ్యాడు. సుధీర్ బాబు హీరోగా ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ బేనర్ అనదగ్గ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బేనర్లో హర్షవర్ధన్ సినిమా తీయబోతున్నాడు.
ఎన్నో ఏళ్ల ప్రయత్నం తర్వాత దర్శకుడిగా ఎంతో ఇష్టపడి, కష్టపడి ఓ సినిమా తీస్తే.. అది విడుదలకు నోచుకోకుండా ఆగిపోతే ఆ దర్శకుడికి మనుగడ కష్టమే. కానీ హర్ష మాత్రం కొంచెం టైం తీసుకుని అయినా పెద్ద బేనర్లో ఫాంలో ఉన్న హీరోతో సినిమా ఓకే చేసుకున్నాడు. ఈ సినిమా కోసం మూడేళ్ల ముందు సన్నాహాలు మొదలుపెట్టాడు హర్ష. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కబోతోంది. మరి రెండో సినిమా అయినా దర్శకుడిగా హర్ష కోరుకున్న ఆరంభాన్నిస్తుందేమో చూద్దాం.
This post was last modified on July 13, 2021 7:36 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…