మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎప్పుడు జరుగతాయో ఏమో స్పష్టత లేదు కానీ.. దాని గురించి మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ ఆగట్లేదు. ఇప్పటికే ఉన్న కార్యవర్గం.. కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్లు.. అలాగే మిగతా వాళ్లు తరచుగా మీడియా ముందుకొచ్చి ఆసక్తికర ప్రకటనలు చేస్తున్నారు. సెన్సేషనల్ కామెంట్లూ చేస్తున్నారు. ‘మా’ ఎన్నికలు ఆలస్యమవుతాయన్న ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులుగా స్తబ్దత నెలకొంది కానీ.. ఇప్పుడు మంచు విష్ణు లైన్లోకి వచ్చి ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఈసారి అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన మంచు విష్ణు.. తాను అధ్యక్షుడిగా గెలిస్తే ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇవ్వడం విశేషం. ‘మా’ సభ్యుల్ని ఉద్దేశించి రిలీజ్ చేసిన వీడియోలో విష్ణు ఈ మాట చెప్పాడు. ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తానని ప్రకటించినపుడే.. ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం భరిస్తానని గతంలోనే తాను హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు విష్ణు. ఆ హామీకి కట్టుబడి ఉంటాడనుకున్నారు కానీ.. ఏకంగా మొత్తం ఖర్చు మొత్తం భరిస్తానని అనడం ద్వారా విష్ణు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్లే. ‘మా’ భవన నిర్మాణం అన్నది దశాబ్దాల కల. గతంలో ప్రభుత్వం స్థలం ఇచ్చినా ‘మా’ భవనం కట్టుకోలేకపోయింది. తర్వాత ప్రభుత్వం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంది. ‘మా’లో ఇంతమంది పెద్దవాళ్లుండి సొంత భవనం కట్టుకోలేకపోవడం పట్ల ఎంతోమంది పెదవి విరిచారు.
కాగా ఈసారి అనూహ్యంగా అధ్యక్ష పదవికి పోటీలోకి వచ్చిన ప్రకాష్ రాజ్.. ప్రధానంగా ‘మా’కు భవనం లేకపోవడం గురించి మాట్లాడ్డం, ‘మా’ గత కార్యవర్గాలపై విమర్శలు చేయడం తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు భవన నిర్మాణం విషయాన్నే అజెండాగా మార్చుకుని, అందుకయ్యే ఖర్చు మొత్తం భరిస్తాననడం ద్వారా ‘మా’ సభ్యుల దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నాడు. మరి దీనిపై ప్రకాష్ రాజ్, అధ్యక్ష పదవికి పోటీ పడే మిగతా వాళ్లు ఎలా స్పందిస్తారో.. వాళ్లేం హామీలతో సభ్యులను ఆకర్షిస్తారో చూడాలి.
This post was last modified on July 13, 2021 7:37 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…