హిందీలో పేరున్న హీరోలు, హీరోయిన్లు వెబ్ సిరీస్‌లు జోరుగా చేస్తున్నారు. ఓటీటీలను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్లు కొంచెం వెనుకబడే ఉన్నారు. వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిలింల పట్ల ఇప్పుడిప్పుడే మన వాళ్ల ఆలోచన మారుతోంది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరో డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
ఐతే దీనిపై అధికారిక ప్రకటనే రాలేదు ఇంకా. ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ్ తన డిజిటల్ డెబ్యూ గురించి స్పందించాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్న సంగతి నిజమే అని ఆయన ధ్రువీకరించడం విశేషం. ఓటీటీ కోసం సినిమా చేయడం గురించి అడిగితే.. తాము ఒక ఐడియా అనుకున్నామని.. అది తనకు బాగా నచ్చిందని.. ప్రస్తుతం దాన్ని డెవలప్ చేస్తున్నామని నాగ్ వెల్లడించాడు.
అందరూ అనుకుంటున్నట్లు అది ఓటీటీ సినిమానే అని కూడా నాగ్ చెప్పడం గమనార్హం. ఈ వేదిక తనకు చాలా కొత్త అని.. అందుకే కాస్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నామని.. సినిమాల్లో ఇప్పటి వరకు చేయనివి ఓటీటీల్లో చేయాలన్నది తన ఆలోచన అని నాగ్ తెలిపాడు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు గురించి ఇంతకుమించి ఏమీ స్పందించలేనని.. దానికింకా టైం ఉందని నాగ్ అన్నాడు. నాగ్ చివరి సినిమా ‘వైల్డ్ డాగ్’ను నేరుగా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయడానికి రెడీ అవడం.. కానీ మళ్లీ మనసు మార్చుకుని థియేటర్లలో విడుదల చేయడం తెలిసిందే.
ఐతే థియేటర్లలో ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదు. తర్వాత నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తే జనం బాగానే చూశారు. కంటెంట్‌ను బట్టి కొన్ని చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడం మంచిదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే నాగ్ ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వెబ్ ఫిలిం చేయడానికి రెడీ అయినట్లున్నాడు.
This post was last modified on July 12, 2021 7:26 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…