ఈ ఏడాది వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘ఉప్పెన’ ఒకటి. ఈ సినిమాతో బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైనే రెండో సినిమా చేయాలనుకున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని కథ సిద్ధం చేసుకున్నారు బుచ్చిబాబు. బౌండెడ్ స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ ని కలిశారు. గతంలో ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు బుచ్చిబాబు కో డైరెక్టర్ గా పని చేయడంతో ఎన్టీఆర్ తో మంచి బంధం ఏర్పడింది.
ఆ సాన్నిహిత్యంతోనే ఎన్టీఆర్ కోసం కథ రాసుకొని ఆయనకు వినిపించారు. ఎన్టీఆర్ కి కూడా కథ నచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పటికే చాలా సినిమాలు కమిట్ అయ్యారు. ముందుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ఆ తరువాత కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను మార్చుకోనున్నారు. దాని తరువాత ప్రశాంత్ నీల్ సినిమా లైన్ లో ఉంది. దీంతో పాటు రీసెంట్ గా తమిళ దర్శకుడు అట్లీ కూడా ఎన్టీఆర్ కి కథ చెప్పారు.
లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నడుస్తుందని సమాచారం. ఇవన్నీ పూర్తి చేసిన తరువాతే బుచ్చిబాబుకి డేట్స్ ఇవ్వగలరు. అయితే ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. అప్పటివరకు ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఎదురుచూస్తారా..? అనేది ప్రశ్న. ఇటీవల బుచ్చిబాబు ‘ఉప్పెన’ టీమ్ తో ఓ చిన్న సినిమా ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ దర్శకుడు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చేవరకు ఎదురుచూస్తారో లేక మరో సినిమా ప్లాన్ చేసుకుంటారో చూడాలి!
This post was last modified on July 11, 2021 10:39 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…