Movie News

టాలీవుడ్లో తమిళ విలన్ హవా

మిళంలో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత అనుకోకుండా నటుడిగా మారి.. ఆర్టిస్టుగా చాలా బిజీ అయిపోయాడు సముద్రఖని. తెలుగులోకి ‘శంభో శివ శంభో’ పేరుతో రీమేక్ అయిన ‘నాడోడిగల్’కు సముద్రఖనినే దర్శకుడు. ఆ చిత్రం తమిళంలో పెద్ద హిట్టే అయింది. ఆ తర్వాత కూడా కొన్ని మంచి సినిమాలు తీశాడు సముద్రఖని.

తన సినిమాల్లోనే క్యామియో తరహా రోల్స్‌తో ఆకట్టుకున్న సముద్రఖని.. తర్వాత పూర్తి స్థాయి నటుడిగా మారాడు. కొన్ని పాత్రలు అతడికి చాలా మంచి పేరు తెచ్చాయి. ‘విచారణ’ సినిమాలో సముద్రఖని చేసిన పోలీస్ పాత్రకు జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు కూడా రావడం విశేషం.

దీంతో సముద్రఖనిపై వేరే భాషల దర్శకుల కళ్లు కూడా పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగులో అల వైకుంఠపురములో, క్రాక్ లాంటి చిత్రాల్లో నటించాడు. ఇవి రెండూ ఎంత పెద్ద విజయం సాధించాయో.. సముద్రఖనికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టాయో తెలిసిందే.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రంలోనూ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సముద్రఖని.. మహేష్ బాబుతోనూ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. మహేష్ ‘సర్కారు వారి పాట’లో మెయిన్ విలన్ పాత్రకు సముద్రఖనినే ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.

ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా పరశురామ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలోనూ సముద్రఖని పాత్ర క్లిక్ అయితే, సినిమా అంచనాలకు తగ్గట్లు విజయవంతమైతే ఇక సముద్రఖనికి టాలీవుడ్లో తిరుగుండదన్నట్లే. తెలుగులో నంబర్ వన్ విలన్ అయినా అయిపోతాడేమో. ఓవైపు భారీ చిత్రాల్లో నటిస్తూనే సముద్రఖని.. చిన్న సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

అశ్విన్ గంగరాజు రూపొందించిన ‘ఆకాశవాణి’లో ఓ కీలక పాత్ర చేసిన ఆయన.. కీరవాణి చిన్న కొడుకు సింహాతో కలిసి ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు.

This post was last modified on July 10, 2021 1:21 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

26 minutes ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

3 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

8 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

9 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

9 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

9 hours ago