గత ఏడాది మలయాళంలో పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ‘కప్పెలా’ ఒకటి. తక్కువ మంది నటీనటులతో, పరిమిత లొకేషన్లలో చాలా చిన్న ఖర్చులో తెరకెక్కిన ఈ సినిమా.. బడ్జెట్ మీద కొన్ని రెట్ల లాభాలు తెచ్చిపెట్టింది. స్టన్నింగ్‌గా ఉండే క్లైమాక్స్ ఈ చిత్రానికి పెద్ద ఎసెట్. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు గత ఏడాదే ప్రకటించిన సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి ప్రారంభోత్సవం కూడా జరిగింది.
ఒరిజినల్లో రోషన్ మాథ్యూ చేసిన సెన్సేషనల్ క్యారెక్టర్‌ను తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్నాడు. శ్రీకాంత్ భాసి చేసిన పాత్రకు తమిళ నటుడు అర్జున్ దాస్‌ను ఎంచుకున్నారు. వీళ్లిద్దరి పాత్రలూ చాలా కొత్తగా ఉంటాయి సినిమాలో. ఇక సినిమాలో వీరి కంటే కూడా కీలకమైంది హీరోయిన్ పాత్ర. మాతృకలో అనా బెన్ ఆ క్యారెక్టర్ చేసింది.
ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ధు కనిపించాడు. అర్జున్ దాస్ సంగతీ ఖరారైంది. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటిదాకా వెల్లడి కాలేదు. చిత్ర వర్గాల సమాచారం తమిళంలో విశ్వాసం, ఎన్నై అరిందాల్ చిత్రాల్లో బాల నటిగా కనిపించిన అనైకను ఈ చిత్రానికి కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు కొత్తే. ఈ అమ్మాయిని లీడ్ రోల్‌లో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.
ఇక ఈ చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా అనుకుంటున్నట్లు సమాచారం. అదే.. బుట్టబొమ్మ. సితార మాతృసంస్థ అయిన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బేనర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’లో బ్లాక్‌బస్టర్ పాట నుంచి సెంటిమెంటుగా ఈ టైటిల్ తీసుకున్నట్లున్నారు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి టైటిల్ బాగానే సెట్ అవుతుంది. ఈ చిత్రంతో శౌరీ చంద్రశేఖర్ రమేష్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ‘కేరాఫ్ కంచరపాలెం’కు సంగీతం అందించిన స్వీకార్ శస్తి ఈ చిత్రానికి పని చేస్తున్నాడు.
This post was last modified on July 8, 2021 4:41 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…
అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన అల్లరి చేష్టలతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…