మలయాళీ ముద్దుగుమ్మ మియా జార్జ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో తన కొడుకుతో పాటు తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె సన్నిహతులు సైతం షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మియా జార్జ్ గర్భవతి అనే విషయం ఎవరికీ తెలియదట. అభిమానులతో కూడా ఆమె ఈ విషయాన్ని పంచుకోలేదు.
సడెన్ గా ఆమె తన కొడుకుతో ఫోటో షేర్ చేసేసరికి హాట్ టాపిక్ గా మారింది. తన బిడ్డకు లూకా జోసెఫ్ ఫిలిప్ అనే పేరు కూడా పెట్టేసింది. ఇక షాక్ నుండి తేరుకున్న ఫ్యాన్స్ ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లో మియా.. కేరళకు చెందిన అశ్విన్ ఫిలిప్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగింది.
ఇక మియా జార్జ్ కెరీర్ విషయానికొస్తే.. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు పూర్తవుతోంది. ‘రెడ్ వైన్’, ‘మెమొరీస్’, ‘డ్రైవింగ్ లైసెన్స్’ అలాంటి హిట్టు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఈమె సునీల్ తో కలిసి ‘ఉంగరాల రాంబాబు’ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె తమిళంలో ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.
This post was last modified on July 8, 2021 3:11 pm
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…