మూడేళ్ల ముందు ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక ఎంతోమంది హీరోయిన్లు తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెట్టారు. ఇందులో ఎంతోమంది ప్రముఖ కథానాయికలు ఉన్నారు. ఎప్పుడెప్పుడో జరిగిన ఉదంతాలు.. ఎవరికీ చెప్పుకోనివి ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇలాంటి హీరోయిన్‌కు అలాంటి అనుభవమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి ఉదంతాల గురించి తెలిసి.
ఇటీవలే బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా చాలా ఏళ్ల కిందట ఓ సౌత్ నిర్మాతతో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సౌత్ సీనియర్ నటి ఖుష్బు లైన్లోకి వచ్చారు. చాలా ఏళ్ల కిందట తనకు ఎదురైన ‘మీ టూ’ చేదు అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒక ప్రముఖ తెలుగు హీరో తనను కమిట్మెంట్ అడిగితే అతడికి తాను ఎలా సమాధానం చెప్పింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుష్బు వెల్లడించింది.
తాను కథానాయికగా కొనసాగుతున్న సమయంలో ఒక తెలుగు హీరో తనను కమిట్మెంట్ అడిగినట్లు ఖుష్బు చెప్పుకొచ్చింది. ఐతే తాను ఆ హీరో చెల్లెలిని తన తమ్ముడి గదిలోకి పంపితే.. తాను ఆయన కోరిక తీరుస్తానని చెప్పినట్లు ఖుష్బు వెల్లడించింది. ఇది చెంప చెల్లుమనిపించే సమాధానం అనడంలో సందేహం లేదు. దీంతో అప్పట్నుంచి ఆ హీరోతో తనకు మాటలు లేవని ఆమె తెలిపింది.
తెలుగులో ఖుష్బు చేసిన సినిమాలు వేళ్లలో లెక్కబెట్టగలిగేవే. మరి ఆ తక్కువమంది హీరోల్లో ఖుష్బును కమిట్మెంట్ కోరి చెంపపెట్టు లాంటి సమాధానం ఎదుర్కొన్న వ్యక్తి ఎవరో మరి. ఉత్తరాది అమ్మాయి అయిన ఖుష్బు.. సౌత్‌లో పెద్ద హీరోయిన్‌గా ఎదిగింది. తమిళంలో ఒక సమయంలో ఆమె నంబర్ వన్ హీరోయిన్‌గా ఉంది. ఇక్కడే సినిమాల్లో స్థిరపడి.. తమిళ దర్శకుడు సుందర్‌ను పెళ్లాడిన ఖుష్బు.. కొన్నేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె.. గత ఏడాదే బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 8, 2021 2:24 pm
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…