షూటింగ్స్ మళ్లీ పున:ప్రారంభం అవుతున్నాయి. సినీ కార్యకలాపాలు యధావిధిగా నడుస్తున్నాయి. థియేటర్లు కూడా తెరుచుకుంటున్నాయి. ఇక మళ్లీ నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీల గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. షూటింగ్ మధ్య దశలో ఉన్నవాళ్లు తర్వాతి రోజుల్లో బెర్తుల కోసం కర్చీఫ్ వేయక తప్పదు. ఆ సమయానికి సినిమాను సిద్ధం చేస్తామో లేదో.. కానీ ముందు కర్చీఫ్ వేసేస్తే బెటర్ అన్న ఉద్దేశంలో నిర్మాతలున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాగే ఒకరితో ఒకరు పోటీ పడి రిలీజ్ డేట్లు ప్రకటించారు. కానీ సెకండ్ వేవ్ పుణ్యమా అని ఆ డేట్లను అందుకోలేని పరిస్థితి తలెత్తింది.
ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గి మళ్లీ ఆశావహ పరిస్థితులు కనిపిస్తుండటంతో సాధ్యమైనంత త్వరగా రిలీజ్ డేట్లను ప్రకటించి రేసులో నిలవాలని చూస్తున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో మళ్లీ రిలీజ్ డేట్ల జాతర తప్పదని అంటున్నారు.
ఈ ఏడాది విడుదల కావాల్సిన రెండు క్రేజీ చిత్రాలు క్రిస్మస్ డేట్ మీద కన్నేసినట్లు తెలుస్తోంది. ‘బాహుబలి-ది కంక్లూజన్’ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న ‘కేజీఎఫ్-చాప్టర్ 2’ వాస్తవానికి ఈ నెల 19న విడుదల కావాల్సింది. కానీ కుదర్లేదు. ఇప్పుడీ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. దసరా మీద కూడా కన్నుంది కానీ.. అప్పటికి థర్డ్ వేవ్ ఉంటుందేమో అన్న భయాలున్నాయి. థియేటర్లు అప్పటికి ఎలా నడుస్తాయో కూడా తెలియదు. కాబట్టి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసిన క్రిస్మస్ సీజన్లోనే ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట.
ఐతే అదే సీజన్ మీద తెలుగు క్రేజీ మూవీ ‘పుష్ప’ను రిలీజ్ చేసే యోచనలో దీని మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13కు అనుకున్నారు కానీ.. ఆ డేట్‌ను అందుకునే అవకాశం లేదు. పైగా ఈ చిత్రాన్ని రెండు భాగాలు చేస్తున్నారు. మొదటి పార్ట్‌కు క్రిస్మస్ సీజన్ కరెక్ట్ అని చూస్తున్నారట. ఇది కూడా బహు భాషా చిత్రమే. పాన్ ఇండియా లెవెల్లో రిలీజయ్యేదే. ఐతే పుష్ప, కేజీఎఫ్-2లను ఒకే సీజన్లో రిలీజ్ చేయడం దేనికీ మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఎవరు ముందుగా డేట్ ప్రకటిస్తే వాళ్లే రేసులో నిలిచే అవకాశముంటుంది. మరి ముందు కర్చీఫ్ వేసేదెవరో చూడాలి.
This post was last modified on July 7, 2021 2:50 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…