‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత తన తదుపరి సినిమా ప్రభాస్ తో చేస్తున్నారు. ‘సలార్’ అనే పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే నెలలో షూటింగ్ పునః ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మరో హీరోయిన్ కి చోటుందని తెలుస్తోంది. కథ ప్రకారం ఇది కీలకపాత్ర అట. దీనికోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన వాణీ కపూర్ ను సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
గతంలో ఈ బ్యూటీ తెలుగులో నాని నటించిన ‘ఆహా కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘బెల్ బాటమ్’, ‘శంషేరా’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో గనుక నటిస్తే ఆమె రేంజ్ మరింత పెరగడం ఖాయం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on July 5, 2021 7:36 am
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…