ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రంలో సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.
ఈ సందర్భంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ…
సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడుపుఠాణి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. అదే టైటిల్ తో నేను సినిమా చేయడం విశేషం. కృష్ణ గారు మా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. దర్శకుడు కుమార్ కె.ఎం ఆసక్తికరంగా మూవీని తెరకెక్కించారని తెలిపారు.
నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ మాట్లాడుతూ…
గూడుపుఠాణి సినిమా చాలా బాగా వచ్చింది. సప్తగిరి గారు చక్కగా నటించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది, హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను తీశాము. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
దర్శకుడు కుమార్ కె. ఎం మాట్లాడుతూ…
నా మొదటి సినిమా గూడుపుఠాణి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సప్తగిరితో తీసాను. ఆడియన్స్ సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ గారు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా రిచ్ గా రావడానికి నాకు హెల్ప్ అయ్యారు, సూపర్ స్టార్ గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం నేను మర్చిపోలేని అనుభూతిని తెలిపారు.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్:ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్
డైరెక్షన్: కుమార్.కె.ఎం
కెమెరామెన్: పవన్ చెన్న
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్: ప్రతాప్ విద్య
ఫైట్స్: సోలిన్ మల్లేష్
పీఆర్ఒ: ఫ్రీడమ్ మీడియా
This post was last modified on July 4, 2021 8:07 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…