సింగర్ చిన్మయి గురించి రెండు రోజులుగా ఓ వార్త జోరుగా ప్రచారంలో ఉంది. ఆమె గర్భవతి అయిందని.. పెళ్లయిన ఏడేళ్లకు బిడ్డకు జన్మనివ్వబోతోందని జోరుగా వార్తలు హల్‌చట్ చేస్తున్నాయి. ఇందుక్కారణం.. ఇటీవలే చిన్మయి కుటుంబంలో జరిగిన ఓ పెళ్లి సందర్భంగా చిన్మయి దిగిన ఫొటోనే. అందులో సంప్రదాయ బ్రాహ్మణ మహిళ తరహాలో మడి చీర కట్టుకుంది. అందులో చూస్తే చిన్మయి కొంచెం కొత్తగా కనిపించింది. కొంచెం లావైనట్లుగా అనిపించింది.
ఐతే ఇదంతా ప్రెగ్నెంట్ కావడంతో వచ్చిన మార్పు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం అంతకంతకూ పెరిగిపోతుండటంతో చిన్మయి స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘ పోస్టు ద్వారా ఈ రూమర్‌కు చెక్ పెట్టింది చిన్మయి. తాను కట్టుకున్న మడి చీర వల్లే తాను ప్రెగ్నెంట్ లాగా కనిపించానని.. అంతకుమించి ఏమీ లేదని చిన్మయి స్పష్టత ఇచ్చింది.
తనకు బేబీ బంప్ వచ్చిందని.. తాను ప్రెగ్నెంట్ అని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటంతో తాను స్పందించాల్సి వచ్చిందని చిన్మయి ఈ పోస్టులో పేర్కొంది. మడి చీరను సరిగా కట్టుకోకపోవడం.. పైగా ఎక్కువగా నడవడం వల్ల అది కొంచెం ఇబ్బందికరంగా తయారైందని.. అందుకే తనకు బేబీ బంప్ ఉన్నట్లుగా సదరు ఫొటోలో కనిపించిందని.. తన పెళ్లి నాటి ఫొటో చూసినా తాను ఇలాగే కనిపిస్తానని చిన్మయి చెప్పింది. అంతకుమించి ఏమీ లేదని.. తన ప్రెగ్నెన్సీ గురించి వార్తలు ఆపాలని ఆమె కోరింది. తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకోవడానికి తాను ఎప్పుడూ ఇష్టపడనని.. తాను ఎప్పుడు ప్రెగ్నెంట్ కావాలన్నది తన ఇష్టమని.. పిల్లలు కావాలా వద్దా అన్నది తాను నిర్ణయించుకుంటానని.. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని గురించి సామాజిక మాధ్యమాల్లో వెల్లడించనని చిన్మయి స్పష్టం చేసింది. రేప్పొద్దున తనకు పిల్లలు పుట్టినా వారి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోనని.. వాళ్లు సోషల్ మీడియాలో ఉండరని చిన్మయి పేర్కొనడం విశేషం.
This post was last modified on July 4, 2021 12:00 pm
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…