నెట్ ఫ్లిక్స్ తో రానా డీలింగ్!

టాలీవుడ్ లో నటుడిగా కెరీర్ మొదలపెట్టినప్పటికీ.. బాలీవుడ్ లో మంచి కాంటాక్ట్స్ సంపాదించగలిగారు రానా దగ్గుబాటి. అక్కడ టాప్ ప్రొడక్షన్ హౌస్ లతో . అలానే ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ఛానెల్స్ తో రానాకి పరిచయాలు ఉన్నాయి. తన సినిమాల ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకున్న రానా ఇప్పుడు డిజిటల్ ఇండస్ట్రీలో రాణించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఓటీటీ యాప్స్ కోసం సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది.

ఇప్పుడు ఆ కంటెంట్ ను ప్రముఖ ఓటీటీ సంస్థలో రిలీజ్ చేసే దిశగా రానా మంతనాలు షురూ చేశారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నెట్ ఫ్లిక్స్ తో డీలింగ్ కుదుర్చుకొని ప్రత్యేకంగా కొన్ని వెబ్ ఫిలిమ్స్ ను, సిరీస్ ను అందులోనే రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు రానా కూడా కరణ్ ను ఫాలో అవ్వాలనుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా వెబ్ సిరీస్ లను, సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

రానా నటించిన ‘విరాటపర్వం’ సినిమా హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ కు అమ్మేశారని.. ఈ సినిమా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో నెట్ ఫ్లిక్స్ సంస్థతో కలిసి పని చేయాలనే ఆలోచనతోనే తన సినిమాను కూడా ఇలా డిజిటల్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి రానా ప్రపోజల్ ను నెట్ ఫ్లిక్స్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూడాలి!