ఆనంద్.. హీరో పేరును టైటిల్‌గా పెట్టిన సినిమానే. కానీ అందులో హీరోయిన్ పాత్రే హైలైట్. ఇందులో రూప పాత్రలో నటించిన కమలిని ముఖర్జీకి ఎంత మంచి పేరొచ్చిందో తెలిసిందే. ఇప్పటికీ ఆమెను ఆ పాత్రలో గుర్తుంచుకుంటారు జనం. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ అవకాశాలందుకుంది కమలిని.
ఐతే నిజానికి ఈ పాత్రను కమలిని చేయాల్సింది కాదట. శేఖర్ ముందు రూప పాత్రకు అనుకున్నది సదానట. అప్పటికే జయం సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయిన సదాను రూప పాత్రలో నటింపజేయాలనుకున్నాడట. కానీ ఆమె ఈ సినిమా కథ కూడా వినకుండానే నో చెప్పేసిందట. ఇందుకు కారణాలేంటో ఆలీ నిర్వహించే ఒక టీవీ షోలో వెల్లడించింది సదా.
ఆనంద్ కోసం అడగడానికి ముందే ఆమె నటించిన ప్రాణం పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా కొత్త దర్శకుడు, నిర్మాతలు తీసిందని.. ముందు నిండు నూరేళ్ల సావాసం పాట వినిపించడంతో కథ కూడా వినకుండా సినిమా ఓకే చేశానని.. ఐతే ఆ సినిమా పరాజయం పాలవడం తన కెరీర్‌పై ప్రభావం చూపిందని.. ఆ సమయంలోనే ఆనంద్ కోసం అడగడంతో కొత్త దర్శకుడిని నమ్మి సినిమా చేసే సాహసం చేయలేకపోయానని సదా వెల్లడించింది.
ఆ సమయానికి తన మనసు చెప్పినట్లు నడుచుకున్నానని.. కాబట్టి ఆనంద్ సినిమా చేయనందుకు రిగ్రెట్స్ ఏమీ లేవని సదా అంది. ఐతే చంద్రముఖి సినిమాలో నటించే అవకాశం వచ్చినా చేయలేకపోవడం గురించి మాత్రం ఎప్పుడూ బాధ పడుతుంటానని సదా చెప్పింది. ముందు జ్యోతిక చేసిన గంగ పాత్ర కోసం అడిగారని.. ఐతే అపరిచితుడులో నటిస్తుండటం వల్ల డేట్లు సర్దుబాటు చేయలేకపోయానని.. తర్వాత నయనతార చేసిన పాత్రను తానే చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదని సదా చెప్పింది.
This post was last modified on July 3, 2021 7:44 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…