లోకనాయకుడు కమల్ హాసన్‌కు ఇప్పుడు పొలిటికిల్ కమిట్మెంట్లేమీ పెద్దగా లేవు. ఆయన పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చవిచూడటంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిక ఆయన దృష్టంతా సినిమాల మీదే ఉంది. ముందుగా ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో చేస్తున్న ‘విక్రమ్’ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత వీలును బట్టి ‘ఇండియన్-2’ మూవీని ఫినిష్ చేయాలనుకుంటున్నారాయన. ప్రస్తుతం ‘విక్రమ్’ షూటింగ్ నడుస్తోంది.
దీని చిత్రీకరణలో పాల్గొంటూనే కొత్త సినిమాల మీద దృష్టిపెట్టాడు కమల్. ఆయన సెన్సేషనల్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా న్యూస్ బ్రేక్ అయింది. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించేదే. గత రెండు దశాబ్దాల్లో సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఎగ్జైటింగ్ డైరెక్టర్లలో వెట్రిమారన్ ఒకడు. తొలి సినిమా ‘పొల్లాదవన్’తోనే అతను సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఆడుగళం, విసారణై, వడ చెన్నై, అసురన్ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగింది. అతడి సినిమాలకు ఎన్నో పురస్కారాలు దక్కాయి.
ఇలాంటి దర్శకుడితో కమల్ సినిమా చేస్తున్నాడంటే ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉంటుందో చెప్పేదేముంది? చాలా ఏళ్లుగా ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తున్న కమల్.. విక్రమ్, ఇండియన్-2తో పాటు వెట్రిమారన్ సినిమాతో మంచి లైనప్పే రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం సూర్యతో ‘వడవాసిల్’ అనే సినిమాను లైన్లో పెట్టాడు వెట్రిమారన్. ధనుష్‌తో వడ చెన్నై సెకండ్ పార్ట్ కూడా తీయాల్సి ఉంది. ముందుగా సూర్య చిత్రాన్ని పూర్తి చేసి తర్వాత కమల్‌తో వెట్రిమారన్ ఓ సినిమా చేస్తాడని అంటున్నారు. వచ్చే ఏఢాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.
This post was last modified on July 7, 2021 10:56 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…