ఓపక్క రాజమౌళి.. ఇంకో పక్క జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలాంటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది? అందులోనూ బాహుబలి లాంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా కుదరడంతో ఆర్ఆర్ఆర్‌పై అంచనాలు ఆరంభంలోనే తార స్థాయికి చేరాయి. ఇక సినిమా మేకింగ్ సాగుతూ.. కొన్ని పోస్టర్లు, ప్రోమోలు వదిలేసరికి ఆ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.
ఈ సినిమా కోసం మొత్తంగా భారతీయ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో తెలిసిందే. కాగా కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత షూటింగ్ పునఃప్రారంభించడం.. బ్యాలెన్స్ టాకీ పార్ట్ పూర్తి చేసి.. ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలుందని అప్ డేట్ ఇవ్వడంతో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు.
ఐతే ఈ అప్‌డేట్‌తో పాటుగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బుల్లెట్ మీద తారక్, చరణ్ చాలా ఉత్సాహంగా దూసుకెళ్తున్న దృశ్యం కనువిందుగా ఉండటంతో దీన్ని చరణ్, తారక్ అభిమానులిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటో మీమ్ క్రియేటర్లకు కూడా మహ బాగా ఉపయోగపడుతోంది. తారక్, చరణ్‌ల తలలకు హెల్మెట్లు పెట్టేసి దీన్ని సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారానికి వాడుకున్న తీరు హైలైట్.
ఇక క్రికెట్ అభిమానులేమో తారక్, చరణ్‌ల స్థానాల్లోకి కోహ్లి, రోహిత్‌లను తెచ్చి పెట్టేశారు. అలాగే సన్‌రైజర్స్ అభిమానులేమో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌ల ఎడిట్‌లు చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరు బాలీవుడ్ హీరోల అభిమానులు సైతం ఈ పోస్టర్‌ను వాడేసుకున్నారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ జనాలకు చాలా బాగా నచ్చేసి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
This post was last modified on June 30, 2021 9:40 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…