తెలుగులో ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లు, యాంథాలజీ ఫిలిమ్స్ జోరు క్రమ క్రమంగా పెరుగుతోంది. పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి కొంచెం పెద్ద స్థాయిలోనే వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఇటీవలే ఆహాలో ఇన్ నేమ్ ఆఫ్ ద గాడ్ పేరుతో కొంచెం పెద్ద స్థాయి వెబ్ సిరీస్ రిలీజైంది. అంతకుముందు లెవెంత్ అవర్ అంటూ పేరున్న సిరీస్ ఒకటి వచ్చింది. త్వరలోనే కుడి ఎడమైతే అంటూ అమలాపాల్ ప్రధాన పాత్రలో ఓ సిరీస్ రాబోతోంది.
ఈ కోవలోనే ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్.. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో ఓ ప్రముఖ ఓటీటీ కోసం ఆంథాలజీ ఫిలిం ఒకటి తెరకెక్కుతోంది. అక్టోబర్ 31.. లేడీస్ నైట్ పేరుతో ఈ ఫిలిం తెరకెక్కుతోంది. ఒక హాలోవీన్ నైట్ జరిగే అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. ఇందులో ఓ కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఎంపిక కావడం విశేషం.
తమన్నా, కాజల్, శ్రుతి హాసన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే డిజిటల్ డెబ్యూ చేసేయగా.. రకుల్ కొంచెం లేటుగా బరిలోకి దిగుతోంది. విశ్వక్సేన్ లాంటి చిన్న హీరోతో కలిసి నటించడానికి ఆమె అంగీకరించడం విశేషమే. ఇందులో నివేథా పెతురాజ్, మాంజిమా మోహన్, మేఘా ఆకాష్, విద్యుల్లేఖ, రెబెక్కా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ప్రధానంగా మహిళల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. ఇందులో విశ్వక్సేన్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడన్నది ఆసక్తికరం.
ప్రధానంగా తెలుగులో తెరకెక్కే ఈ చిత్రాన్ని తమిళం, హిందీల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి థియేట్రికల్ రిలీజ్ ఉండదు. ఎ.ఎల్.విజయ్ తలైవి లాంటి భారీ చిత్రం తర్వాత చేస్తున్న సినిమా ఇదే. ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలో రిలీజవుతుందని సమాచారం.
This post was last modified on June 28, 2021 10:29 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…