ప్రోమో షూట్ లో తమన్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా జెమినీ టీవీలో ప్రసారం కానున్న టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతుందని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ టీవీ షోకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొని క్లారిటీ ఇచ్చేసింది తమన్నా. స్టార్ ప్లస్ లో ప్రసారమవుతోన్న ‘మాస్టర్ చెఫ్’ కుకింగ్ షోని ఇప్పుడు సౌత్ లోకి తీసుకొస్తున్నారు. తెలుగు వెర్షన్ కోసం తమన్నాను హోస్ట్ గా తీసుకున్నారు. దీనికోసం ఆమెకి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు.

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో షూట్ లో పాల్గొంది తమన్నా. ఇదే సమయంలో విజయ్ సేతుపతిని కలిసింది. తమిళ వెర్షన్ కి హోస్ట్ గా విజయ్ సేతుపతి వ్యవహరిస్తున్నారు. బెంగుళూరులో ప్రోమో షూట్ ను ప్లాన్ చేయగా.. తమన్నా, విజయ్ సేతుపతి అక్కడకు చేరుకొని షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. జూలై నెలలో ఈ షోను టెలికాస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన తమన్నా ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజయ్యాయి. రీసెంట్ గా అమెజాన్ కోసం మరో సిరీస్ లో నటించడానికి అంగీకరించింది. ఇప్పుడు టీవీ షోతో బుల్లితెరను కూడా కవర్ చేయబోతుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.