సౌత్ లో హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నమిత. ఒకప్పుడు ఆమె తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించేది. ఆ తరువాత కోలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. శరీర బరువు పెరగడంతో ఆమెకి తెలుగులో అవకాశాలు రాలేదు. కొన్నాళ్లక్రితం ‘సింహ’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఒకట్రెండు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గా నమిత తన పేరు మీద ఓటీటీ ఛానెల్ మొదలుపెట్టింది. ఇప్పుడు ఏకంగా ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది.
ఓ పక్క ఓటీటీ పనులు, మరోపక్క సినీ నిర్మాణ పనులు చూసుకుంటూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. తన పేరు మీద ‘నమిత ఫిలిం ఫ్యాక్టరీ’ అనే బ్యానర్ పెట్టినట్లు చెప్పిన ఈ హాట్ హీరోయిన్ మొదటి సినిమా నిర్మాణ పనులు మొదలుపెట్టినట్లు చెప్పింది. ముందుగా తన బ్యానర్ పై ‘బౌ బౌ’ అనే సినిమా తీస్తున్నట్లు చెప్పింది. ఇందులో తనే లీడ్ రోల్ చేస్తున్నట్లు.. ఆ తరువాత స్థానం కుక్కదే అని చెప్పింది.
తను జంతు ప్రేమికురాలు కావడంతో ఈ సినిమా తీస్తున్నట్లు వెల్లడించింది. ఐదారు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమెకి తెలుగులో అవకాశాలు వస్తున్నట్లు.. కానీ ఇప్పుడు రివీల్ చేయనని అంటోంది. త్వరలోనే ఓ తెలుగు-తమిళ సినిమా ప్రకటన వస్తుందని చెప్పుకొచ్చింది. ఇక తన ఓటీటీ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి 40 నిమిషాల నిడివితో షార్ట్ ఫిలిమ్స్ స్ట్రీమింగ్ పెట్టినట్లు చెప్పింది. త్వరలోనే ఈ ఓటీటీను గ్రాండ్ గా లాంచ్ చేస్తామని తెలిపింది.
This post was last modified on June 27, 2021 3:19 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…