శేఖర్ కమ్ముల దర్శకుడిగా అరంగేట్రం చేసి దశాబ్దంన్నర దాటింది. ఈ కాలంలో ఆయన్నుంచి మంచి మంచి సినిమాలు వచ్చాయి. హ్యాపీడేస్, ఫిదా లాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన సత్తాను చూపించాడు కమ్ముల. పెద్ద స్టార్లేమీ లేకుండానే ఆయన అంత భారీ విజయాలను అందుకున్నాడు. అలాంటిది శేఖర్ స్టార్లతో జట్టు కట్టి.. మంచి సినిమా తీస్తే వాటి స్థాయే వేరుగా ఉంటుందన్న అంచనాలున్నాయి.
కానీ కమ్ముల ఇప్పటిదాకా ఒక్క పెద్ద స్టార్‌తోనూ సినిమా చేయలేకపోయాడు. తాను స్టార్లతో సినిమాలు చేయడానికి రెడీ అంటుంటాడు కానీ.. ఇతను వాళ్లను సంప్రదించడా.. లేక వాళ్లే ఇతడితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించరా అన్నది అర్థం కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కమ్ముల శిష్యుడైన నాగ్ అశ్విన్ రెండు క్లాస్ సినిమాలే తీసి ఏకంగా ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం పట్టేశాడు. కానీ శేఖర్ మాత్రం ఇప్పటిదాకా తెలుగులో పెద్ద స్టార్‌తో ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు.
ఇప్పుడు లవ్ స్టోరీలో నటించిన నాగచైతన్యనే కమ్ముల ఇప్పటిదాకా చేసిన హీరోల్లో కొంచెం రేంజ్ ఉన్నవాడు. ఆ సినిమా అంచనాలకు తగ్గట్లు హిట్టయితే అయినా బడా స్టార్లు కమ్ములతో సినిమా చేస్తారేమో అనుకుంటే ఆ చిత్రం వాయిదా పడింది. ఈలోపు ఆశ్చర్యకరంగా తమిళ స్టార్ ధనుష్.. కమ్ములతో సినిమాను ఓకే చేశాడు. వీరిలో ఎవరు ముందు అడుగు వేసి సంప్రదింపులు జరిపారో తెలియదు.
ఐతే మన స్టార్లు నమ్మని కమ్ములను తమిళంలో పెద్ద స్టార్ అయిన ధనుష్ నమ్మడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది చూసి మన హీరోలకు కమ్ముల మీద ఈమాత్రం భరోసా కలగలేదేంటి అని అతడి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి ధనుష్‌తో పెద్ద హిట్ ఇస్తే అయినా కమ్ములతో మన బడా స్టార్లు సినిమాలు చేస్తారేమో చూడాలి.
This post was last modified on June 27, 2021 2:19 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…