టీవీ షోలకు సంబంధించి ప్రోమోలు కట్ చేయడంలో వాటి డైరెక్టర్లు మహా తెలివినే ప్రదర్శిస్తుంటారు. ఆయా షోల్లో ఏదో జరగరానిది జరిగిపోయినట్లు.. పెద్ద గొడవ అయినట్లుగా చిత్రీకరిస్తూ ప్రోమోలు వదులుతుంటారు. అవి చూసి తర్వాతి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తారు. తీరా ఆ ఎపిసోడ్ చూస్తే అంతా డ్రామా అని తెలుస్తుంది. ప్రోమోల్లో చూపించినంతగా ఏమీ జరిగిపోలేదని తేలుతుంది. ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. అయినాసరే.. మళ్లీ మళ్లీ జనాల చెవుల్లో పూలు పెడుతూనే ఉంటారు. జబర్దస్త్ కామెడీ షోలోనూ తాజాగా ఇదే జరిగింది. ఈ వారం జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్ సందర్బంగా ఓ వివాదం నెలకొన్నట్లుగా ప్రోమో కట్ చేయడం తెలిసిందే.
ఈ స్కిట్‌కు అతిథిగా వచ్చిన శివ అనే యూట్యూబ్ యాంకర్ తన డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలతో అనసూయ హర్టయి షో నుంచి వాకౌట్ చేసినట్లుగా చూపించారు. ప్రోమోలో అయితే వ్యవహారం చాలా సీరియస్ అయినట్లే కనిపించింది. ఐతే ఇంతకీ ఏం జరిగిందా అని ఎపిసోడ్ చూసిన వాళ్లంతా ఫూల్స్ అయిపోయారు. పొట్టి పొట్టి బట్టలేయడం గురించి జనాలు చేసే కామెంట్లు చూస్తే ఏమనిపిస్తుంది అని శివ అడిగితే.. ఇండస్ట్రీలో ఉండి మీరు కూడా ఏంటి అంది అనసూయ. తర్వాత ఇది నా పర్సనల్ అంది. పర్సనల్ అయితే ఇంట్లో చూసుకోవాలి అని శివ అనడంతో అనసూయ హర్టయి సెట్ నుంచి బయటికి వెళ్లిపోయింది.
ఆది, అభి తదితరులు బయటికెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వాతావరణం చాలా సీరియస్‌గా మారిపోయింది. కాసేపటికి అనసూయ తిరిగొచ్చింది. వాతావరణం గంభీరంగా ఉన్న సమయంలో ఉన్నట్లుండి ఫక్కున నవ్వేసింది. ఇదంతా డ్రామా అన్న విషయం అప్పుడు బయటపడింది. ఐతే ఇలాంటివి అనసూయ ఎన్నో చూసి ఉంటుంది కాబట్టి ఆమె హర్టవడం నిజమని తాను అనుకోలేదని రోజా చెప్పడం విశేషం. సోషల్ మీడియాలో నిత్యం ట్రోల్స్ ఎదుర్కొంటూ రాటుదేలిన అనసూయ ఇలాంటి ఒక కామెంట్‌కు అంత హర్టయి ఉంటుందని ఎలా అనుకుంటాం?
This post was last modified on June 26, 2021 11:54 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…