తెలుగులో చాలా వేగంగా సినిమాలు చేసుకుపోయే హీరోల్లో నాని ఒకడు. ఒకప్పుడైతే నాని సినిమాల బడ్జెట్లు, బిజినెస్‌ల రేంజ్ తక్కువుండేది. చకచకా సినిమా అవగొట్టేసేవాడు. కానీ ఇప్పుడు అతడి సినిమా స్థాయి పెరిగింది. అతను మిడ్ రేంజ్ స్టార్ అయ్యాడు. అతడి సినిమాల మీద రూ.30 కోట్లకు మించి బడ్జెట్లు పెడుతున్నారు. అందులోనూ ‘శ్యామ్ సింగరాయ్’ అయితే నాని కెరీర్లోనే అత్యధికంగా.. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతోంది. నాని కెరీర్లోనే ఏ చిత్రానికీ లేనంత వర్క్.. శ్రమ ఈ సినిమాతో ముడిపడి ఉన్నాయి.
మూడు దశాబ్దాల కిందటి కోల్‌కతా నగర నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. దీని కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు పెట్టి కోల్‌కతా సిటీ సెట్ వేశారు. మధ్యలో కొన్ని రోజులు కోల్‌కతాకు కూడా వెళ్లి వచ్చింది చిత్ర బృందం. లాక్ డౌన్ రాకుంటే ఈపాటికి సినిమా విడుదలకు సిద్ధం అయ్యేదే. మధ్యలో విరామం వచ్చినా సరే.. సినిమా మరీ ఏమీ ఆలస్యం కాలేదు.
లాక్‌డౌన్‌కు ముందే మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. ఇటీవలే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండటం విశేషం. ఇంత భారీ చిత్రాన్ని కూడా నాని మొత్తంగా మూడు నెలల్లో పూర్తి చేసేయబోతుండటం విశేషం. ఇంకో రెండు వారాల్లోనే షూటింగ్ అయిపోతుందట. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయినంత వరకు లాక్ డౌన్ బ్రేక్‌లో నాని డబ్బింగ్ కూడా ఫినిష్ చేసినట్లు తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొంత వరకు జరిగాయట. ఇంకో నెలన్నర కల్లా ‘శ్యామ్ సింగరాయ్’ రెడీ అయిపోతుందని తెలుస్తోంది.
నాని ఇప్పటికే ‘టక్ జగదీష్’ సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. అది ఆగస్టులో రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ‘శ్యామ్ సింగరాయ్’ రిలీజవుతుంది. ఈ ఏడాది నాని రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుండటం ఖాయం. ‘శ్యామ్ సింగ రాయ్’ పని పూర్తవగానే ‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్‌తో నాని ‘అంటే సుందరానికి’ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు నాని.
This post was last modified on June 25, 2021 7:03 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…