Movie News

ఎన్నికల్లో పోటీకి ప్రకాశ్ రాజ్ అంత గ్రౌండ్ వర్కు చేశారా?

సార్వత్రిక ఎన్నికలో.. ఉప ఎన్నికలో అయితే ఎంత రాజకీయం ఉంటుందో.. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కు జరిగే ఎన్నికలకు సంబంధించి కూడా అంతే రాజకీయం నడుస్తోంది. వెయ్యి మంది కూడా సభ్యులు లేని ఈ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఎన్నికలు జరగటానికి మరో మూడు నెలల సమయం ఉంది. ఎప్పుడైతే ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారో అప్పటి నుంచి వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

అసలు ప్రకాశ్ రాజ్ ఎందుకు పోటీ చేస్తున్నట్లు? ఆయన పోటీ చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ఆయన వెనుక ఉన్నదెవరు? పర భాషా నటుడు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. మరి.. ఇలాంటి ప్రశ్నలకు ప్రకాశ్ రాజ్ ను అడిగితే ఆయనేం సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనేం చెప్పారంటే..

  • ఒక రోజులో హటాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. దాని వెనుక చాలా మథనం ఉంది. ఈ పరిశ్రమ నాకు పేరు.. హోదా.. గౌరవం ఇచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాల్ని చూస్తూ ఊరుకోవటం మంచిది కాదనిపించింది. ఊరికే బాగోలేదన్న ఫిర్యాదులు చేసే బదులు.. పని చేసి చూపించటం కష్టం. అది బాధ్యత కూడా. అందుకే నిర్ణయం తీసుకున్నా.
  • ఏడాది క్రితం నుంచి కళ్ల ముందు జరుగుతున్నది చూస్తూ కూర్చోవటం సరికాదనిపించింది. సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలనిపించింది. నాలా ఆలోచించే వారితో ఒక టీం తయారు చేసుకున్నా. మార్చిలో జరగాల్సిన ఎన్నికలు కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. కానీ.. ఆ విషయాన్ని అయినా కమిటీ చెప్పాలి కదా? ఎప్పుడు ఎన్నికలు జరుపుతారని ఇప్పటికి చెప్పటం లేదు. నా ఉద్దేశంలో ఇప్పుడున్ని ఎన్నికైన బాడీ కాదు. దాని సమయం పూర్తైంది. అందుకే మేం ప్యానల్ ప్రకటించాం.
  • సినిమా అనేది ఒక భాష. వీడు మనోడు.. వేరే వాడు అనే ఆలోచన తప్పు. తెలుగు వ్యక్తి విశాల్ తమిళనాడు అసోసియేషన్ ఎన్నికల్లో గెలవలేదా? అక్కడ అన్ని భాషల వారు పోటీ చేశారు కదా? ఇప్పుడు లోకల్.. నాన్ లోకల్ అని మాట్లాడుతున్న వారికి నేను తెలంగాణలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనిపించలేదా?
  • నా అసిస్టెంట్లకు హైదరాబాద్ లో ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్ లోకల్ అనిపించలేదా? నాకు ఇక్కడ పొలం ఉంది. ఇల్లు ఉంది. నా కొడుకు ఇక్కడే స్కూలుకు వెళతాడు. నా ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడే ఉంది. అలాంటప్పుడు నేను నాన్ లోకల్ ఎందుకు అవుతారు? అంత:పురం సినిమాకు జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు నేను నాన్ లోకల్ కాలేదే? తొమ్మిది నందులు తీసుకున్నప్పుడు నేను నాన్ లోకల్ కాలేదే? అప్పుడు లేనిది ఇప్పుడెందుకు వచ్చింది? ప్రకాశ్ రాజ్ తెలుగు వాడు కాదని ఎవరైనాఅంటే ప్రేక్షకులే వారి మోహం మీద నవ్వుతారు.

This post was last modified on June 25, 2021 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

4 hours ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

4 hours ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

5 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

5 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

5 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

5 hours ago