పాప్ మ్యూజిక్ గురించి కాస్తో, కూస్తో పరిచయం ఉన్నవారందరికీ బ్రిట్నీ స్పియర్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఫేమస్ పాప్ సింగర్.. ఆమె పాట వింటే ఎవరికైనా ఇట్టే ఊపు వచ్చేస్తోంది. ఆమె ఒక్కసారి పాట పాడితే.. రూ.లక్షలు ఇవ్వడానికి ఎంతో మంది రెడీగా ఉంటారు. ఆ సంపాదనతో ఆమె ఎంతో ఆనందంగా గడుపుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే.. తాను గత 13ఏళ్లు గా ఏరోజు ఆనందంగా లేనని.. తన తండ్రి కారణంగా నరకం చూస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
తనకు గార్డియన్ గా.. తన తండ్రిని ఉంచొద్దంటూ.. తనకు రక్షణ కల్పించాలంటూ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పేర్కొనడం గమనార్హం. తన తండ్రి జేమీ స్పియర్స్.. తన జీవితాన్ని నాశనం చేశాడని.. అతని చెర నుంచి రక్షణ కల్పించాలంటూ ఆమె ఆరోపించింది.
తన గార్డియన్ హోదా నుంచి తండ్రి జేమీని తప్పించాలంటూ బ్రిట్నీ… కాలిఫోర్నియా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్ మీద వాదనలు జరగ్గా.. 20 నిమిషాలపాటు ఏకధాటిన బ్రిట్నీ, జడ్జి ముందు కన్నీళ్లతో తన గొడును వెల్లబోసుకుంది. బలవంతంగా ఆయన్ని తన సంరక్షకుడిగా నియమించారని, కానీ, ఆ తర్వాతే తన జీవితం నాశనం అయ్యిందని బ్రిట్నీ వాపోయింది.
తన తండ్రి వల్ల తాను రోజూ నరకం అనుభవించానని ఆమె వాపోయారు. ఇష్టం లేకున్నా గంటల తరబడి పని చేశానని చెప్పారు. డబ్బు, హోదా అన్నీ ఆయనే అనుభవించాడని.. తన సంపాదన లో ఒకటో వంతును కూడా తన ఖర్చులకు ఇవ్వలేదని వాపోయారు.
తన ఫోన్ దగ్గరి నుంచి విలువైన కార్డుల దాకా అన్నీ ఆయన కంట్రోల్‌లో ఉండిపోయేవని చెప్పారు. రోజూ తనకు లిథియం డ్రగ్ ఎక్కించేవాడని.. తన పిల్లలకు కూడ తనను దూరం చేశాడని ఆరోపించింది. మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనే నా ఆశలకు అడ్డుపడ్డాడని.. ఆయన సంరక్షణ తనకు మంచి కంటే చెడు ఎక్కువగా చేసిందని వాపోయింది. ఒకరకంగా ఇది ‘సెక్స్ ట్రాఫికింగ్’కి సమానం. ఇకనైనా నా జీవితం నాకు ఇప్పించండి అంటూ బ్రీట్నీ పేర్కొనడం గమనార్హం.
This post was last modified on June 24, 2021 8:32 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…