Movie News

మకాం మార్చేసిన రష్మిక

ప్రస్తుతం ఇండియాలో బహు భాషల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఆమె బేసిగ్గా కన్నడ నటి. అక్కడ తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’తోనే ఆమె పెద్ద హిట్టు కొట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక తెలుగులో రష్మిక వరుసగా ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి ఘనవిజయాలతో పెద్ద స్టార్ అయిపోయింది. ఇటీవలే ‘సుల్తాన్’ సినిమాతో తమిళంలోకి కూడా అడుగు పెట్టింది రష్మిక. ఇప్పుడిక ఆమె హిందీలో ఆధిపత్యం చలాయించడానికి రెడీ అవుతోంది.

‘మిషన్ మజ్ను’తో పాటు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న మరో హిందీ చిత్రంలోనూ రష్మిక నటించనున్న సంగతి తెలిసిందే. ఈపాటికే ఈ చిత్రాల షూటింగ్ మొదలు కావాల్సింది కానీ. కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఐతే లాక్ డౌన్ షరతులు తొలగిపోయి మళ్లీ అన్ని ఇండస్ట్రీలూ షూటింగ్ దశలోకి వెళ్లనున్న నేపథ్యంలో బాలీవుడ్ ఒక అడుగు ముందే ఉంది. అక్కడ ఇప్పటికే షూటింగ్స్ మొదలైపోయాయి.

రష్మిక చేతిలో వివిధ భాషల్లో కలిపి దాదాపు అరడజను సినిమాలుండగా.. ఆమె కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత ముందుగా బాలీవుడ్లోనే షూటింగ్‌కు హాజరు కాబోతోంది. ‘మిషన్ మజ్ను’ కోసం రష్మిక ముందుగా డేట్లు ఇచ్చింది. ఇందుకోసం ముంబయికి చేరుకున్న రష్మిక అక్కడ కొత్తగా ఒక అపార్ట్‌మెంట్ ప్లాట్ తీసుకోవడం విశేషం. మామూలుగా సౌత్ నుంచి వెళ్లి హిందీలో సినిమా చేసే హీరోయిన్లు తాత్కాలికంగా హోటళ్లలో బస చేస్తారు. కానీ రష్మిక మాత్రం అలా కాకుండా ఫ్లాట్ అద్దెకు తీసుకుంది.

హిందీలో ఒకటికి రెండు చిత్రాల్లో నటించాల్సి ఉండటం.. భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించే ఛాన్స్ ఉంటుందన్న ఆలోచనతో రష్మిక అక్కడ ఫ్లాట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను తీసుకున్న కొత్త ఫ్లాట్ గురించి అప్‌డేట్ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు కూడా పెట్టింది రష్మిక. చూస్తుంటే బాలీవుడ్ విషయంలో రష్మిక భారీ ప్రణాళికలతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. తెలుగులో ఆమె ‘పుష్ప’లో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on June 24, 2021 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

1 hour ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago