కొన్నేళ్ల ముందు వరకు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించిన స్టార్ ఎవరూ కనిపించేవారు కాదు. సినిమాల బడ్జెట్లు, బిజినెస్‌లు, కలెక్షన్ల విషయంలో రికార్డులన్నీ ఆయన పేరిటే ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో కథ మారిపోయింది. రజినీ డౌన్ కావడం.. అదే సమయంలో దళపతి విజయ్ రైజ్ అవడం ఒకేసారి జరుగుతూ వచ్చింది. చూస్తుండగానే రజినీని దాటేసి విజయ్ ముందుకు వెళ్లిపోయాడు. ఇప్పుడు విజయ్ ముందు రజినీనే కాదు.. ఏ తమిళ హీరో కూడా నిలవలేకపోతున్నాడు. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా అతను ఎదిగిపోయాడు.
తెలుగులో సైతం అతను మార్కెట్‌ను పెంచుకున్నాడు. యావరేజ్, నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధిస్తుండటం విజయ్ స్టామినాకు నిదర్శనం. సంక్రాంతికి రిలీజైన ‘మాస్టర్’ ఇలాగే వసూళ్ల మోత మోగించడం తెలిసిందే. ఇప్పుడు అతడి నుంచి రానున్న కొత్త చిత్రంపైనా భారీ అంచనాలే ఉన్నాయి.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ రూపొందిస్తున్న విజయ్ కొత్త చిత్రానికి ‘బీస్ట్’ అనే టైటిల్ ఖరారైంది. మంగళవారం విజయ్ పుట్టిన రోజు నేపథ్యంలో ముందు రోజు ఈ చిత్రం నుంచి రెండు లుక్స్ వదిలారు. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ట్విట్టర్లో టీవీ ప్రెజెంటర్ డీడీ ఒక స్పేస్ పెట్టింది. ఇందులో ‘బీస్ట్’ దర్శకుడు నెలన్స్‌తో పాటు కీర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్పేస్‌కు రికార్డు స్థాయిలో 27, 971 మంది హాజరు కావడం విశేషం. ఇండియాలో ఇప్పటిదాకా ఏ స్పేస్‌లోనూ ఇంతమంది పాల్గొనలేదు.
ప్రపంచ స్థాయిలో కూడా ఇది రెండో అతి పెద్ద స్పేస్ కావడం విశేషం. ఇప్పటిదాకా చైనీస్ మ్యుజీషియన్ బామ్ బామ్ మీద నిర్వహించిన స్పేస్‌కు అత్యధికంగా 44,208 మంది హాజరయ్యారు. దాని తర్వాతి స్థానం విజయ్ మీద పెట్టిన స్పేస్‌కే కావడం గమనార్హం. నిక్ కార్టర్ హ్యాష్‌ట్యాగ్‌తో పెట్టిన స్పేస్ (26,218) రికార్డును విజయ్ బర్త్ డే స్పేస్ అధిగమించి రెండో స్థానానికి చేరింది.
This post was last modified on June 22, 2021 8:17 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…