ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది యువ కథానాయకుడు నితిన్ కెరీర్. వరుస ఫ్లాపుల తర్వాత భీష్మతో ఫామ్ అందుకున్నాడనుకుంటే.. ఈ మధ్య చెక్, రంగ్‌దె సినిమాలతో స్వల్ప వ్యవధిలో రెండు పరాజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన పవర్ పేట చిత్రాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెడుతున్నాడు నితిన్.
దాని కంటే ముందు అంధాదున్ రీమేక్ మాస్ట్రోను నితిన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయినట్లు కూడా తాజాగా వెల్లడించారు. కాగా ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్‌తో చర్చలు పూర్తయ్యాయని.. డిజిటల్ రిలీజ్‌కే సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
మాస్ట్రో సినిమాను తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో పూర్తి చేసేశారు. మంచి లాభానికే ఓటీటీ డీల్ రావడంతో ఆ మార్గంలోనే సినిమాను రిలీజ్ చేసేద్దామనుకుంటున్నారట. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మళ్లీ థియేటర్ ఇండస్ట్రీ కుదేలైంది. మళ్లీ పూర్తి స్థాయిలో బిగ్ స్క్రీన్లలో సినిమాలు నడవడానికి సమయం పడుతుంది. పైగా రెండు వరుస ఫ్లాపుల తర్వాత నితిన్ నుంచి ఓ రీమేక్ మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆశించినంత ఆసక్తి ఉండకపోవచ్చు.
ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లలో రిలీజై అటు అయితే నితిన్ కెరీర్‌కు ఇబ్బందే. అందుకే మాస్ట్రోను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారంటున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందించిన ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా నభా నటేష్ నటించింది. తమన్నా కీలక పాత్ర పోషించంది. నితిన్ సొంత సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.
This post was last modified on June 21, 2021 9:28 am
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…