జూలై 11 నుండి సెట్స్ పైకి పవన్!

‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అలానే మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కొంతవరకు జరగ్గా.. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కొంచెం మెరుగు పడుతుండటంతో షూటింగ్‌లు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ కూడా తన సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ ను నిర్మించారు. ఈ సెట్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జూలై 11 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అదే రోజు నుండి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనున్నారు. పవన్ తో పాటు రానా కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నిత్యామీనన్ కనిపించనుంది. సినిమాలో ఆమె కనిపించేది తక్కువ సేపే అయినప్పటికీ ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి అందిస్తోన్న మాటలు, స్క్రీన్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.