ఇంతకుముందు సినిమాలే గొప్ప.. వెబ్ సిరీస్‌లు తక్కువ అన్నట్లు చూసిన వాళ్లందరూ ఇప్పుడు ఆలోచన మార్చుకుంటున్నారు. వీటి పొటెన్షియాలిటీని అర్థం చేసుకుంటున్నారు. డిజిటల్ మీడియందే భవిష్యత్ అంతా అనే వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్లు సైతం వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్లో ముందుగా ఈ విషయంలో ధైర్యం చేసింది హీరోయిన్లే.
తమన్నా, కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్, సమంత లాంటి పెద్ద హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు వెబ్ సిరీస్‌ల్లో నటించడం తెలిసిందే. ఐతే హీరోల్లో మాత్రం ఇంకా కదలిక రాలేదు. బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్ లాంటి పెద్ద హీరోలు వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేయగా.. టాలీవుడ్ నుంచి మాత్రం ఇంకా ఏ స్టార్ హీరో డిజిటల్ డెబ్యూ చేయలేదు. ఐతే ఈ విషయంలో సీనియర్ హీరోగా అక్కినేని నాగార్జున ముందడుగు వేస్తున్నట్లు సమాచారం.
టాలీవుడ్ నుంచి వెబ్ సిరీస్ చేయనున్న తొలి స్టార్ హీరోగా అక్కినేని హీరో రికార్డు సృష్టించబోతున్నట్లు సమాచారం. ఆయన ఒక టాప్ ఓటీటీ కోసం ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేయబోతున్నారట. ఈ సిరీస్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారు, ప్రధాన పాత్రధారులెవరు, ఇతర విశేషాలను త్వరలోనే ప్రకటించబోతున్నారట. నాగ్ నుంచే కొన్ని రోజుల్లో ఈ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలిసింది. కెెరీర్ ఆరంభం నుంచి ట్రెండుకు తగ్గట్లుగా తనను తాను మార్చుకుంటూ సాగుతున్నాడు నాగ్.
భిన్నమైన జానర్లు ఎంచుకోవడం, కొత్త దర్శకులను పరిచయం చేయడం ద్వారా ఎప్పుడూ ఔట్ డేట్ అయిన భావన కలిగించలేదు నాగ్. యువ కథానాయకులను మించి కొత్తగా ఆలోచిస్తుంటారాయన. ఆయన చివరి చిత్రం ‘వైల్డ్ డాగ్’ థియేటర్లలో అనుకున్నంత ఆడలేదు కానీ.. నెట్ ఫ్లిక్స్‌లో అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఇది కూడా వెబ్ సిరీస్ చేయడానికి ఆయన్నిపురిగొలిపి ఉండొచ్చేమో. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కాజల్ జోడీగా నాగ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 18, 2021 10:55 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…