నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇప్పటివరకు విడుదలైన సినిమా టీజర్, పాటలు అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ‘సారంగ దరియా’ పాటకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్ లో ఈ పాటకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఫస్ట్ కాపీ ఎప్పుడో రెడీ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నారు.
చాలా రోజులుగా ఈ సినిమా ల్యాబ్ లోనే ఉండిపోయింది. దీంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా విడుదలవుతునని అన్నారు. సెకండ్ వేవ్ తరువాత రాబోయే పెద్ద సినిమా ఇదేనంటూ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిర్మాత సునీల్ నారంగ్ మాత్రం నైట్ కర్ఫ్యూ ఉంటే సినిమా ఎలా రిలీజ్ చేస్తామని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ.. నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని సునీల్ నారంగ్ అన్నారు. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తరువాత ఎవరైనా సినిమా విడుదల విషయం ఆలోచిస్తారని.. మూడు ప్రదర్శనలతో థియేటర్లు నడిపించడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. అలానే సినిమా నిర్మాతలు కూడా తమ సినిమాలను విడుదల చేయాలనుకోరని ..
తెలంగాణతో పాటు ఏపీలో కరోనా పరిస్థితులు థియేటర్లు తెరవడానికి అనుకూలంగా ఉండాలి కదా.. అని అన్నారు. జూలై రెండో వారానికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ థియేటర్లు తీర్చుకోవడానికి అనుమతులు లభించినా.. నైట్ కర్ఫ్యూ తీసేసిన తరువాతే కొత్త సినిమాలు విడుదల చేస్తారని స్పష్టం చేశారు. ‘లవ్ స్టోరీ’ సినిమా నైట్ కర్ఫ్యూ తీసిన వారం తరువాత విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
This post was last modified on June 16, 2021 12:12 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…