చూడ్డానికి సాఫ్ట్‌గా కనిపించే కొందరు హీరోయిన్లను కొంచెం కటువుగా ఉండే పాత్రల్లో ఊహించుకోవడం కష్టం. రాశి ఖన్నా ఆ కోవకే చెందుతుంది. కథానాయికగా తన తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే నుంచి గమనిస్తే రాశి చాలా వరకు సున్నితంగా ఉండే పాత్రల్లోనే నటించింది. అగ్రెసివ్ రోల్స్ పెద్దగా చేయలేదు. ఆమెకు వయొలెంట్ క్యారెక్టర్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఫిలిం మేకర్స్‌కు రాకపోవచ్చు.
ఐతే కెరీర్లో తొలిసారిగా ఆమె అలాంటి పాత్రనే చేయబోతోంది. రాశి సైకో కిల్లర్ పాత్రలో నటించబోతోందన్న వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐతే రాశి ఈ క్యారెక్టర్ చేయబోయేది సినిమాలో కాదట. వెబ్ సిరీస్‌లోనట. చాలామంది స్టార్ హీరోయిన్ల బాటలోనే రాశి డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు ఇటీవలే ఖరారైంది.
బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన అజయ్ దేవగణ్ ‘రుద్ర’ లీడ్ రోల్ చేయనున్నాడు. ఆయనకు కూడా ఇదే తొలి వెబ్ సిరీస్. ఇందులో రాశి సైకో కిల్లర్ పాత్ర పోషిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది. ఐతే రాశిని అలాంటి పాత్రలో ఊహించుకోవడం తన అభిమానులకు కొంచెం కష్టమే. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో కొంచెం బోల్డ్‌గా ఉండే పాత్ర చేస్తే వాళ్లు జీర్ణించుకోలేకపోయారు.
రాశి మొదట్నుంచి కూడా సాఫ్ట్, లవ్లీ క్యారెక్టర్లే చేస్తూ రావడం.. ఆ పాత్రలతోనే అభిమానులను సంపాదించుకోవడం ఇందుక్కారణం కావచ్చు. మరి సైకో కిల్లర్ పాత్రలో రాశి తన అభిమానులకు ఎలాంటి షాకిస్తుందో చూడాలి. ఆమె హిందీలో షాహిద్ కపూర్ హీరోగానూ ఓ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇక దక్షిణాదిన తెలుగు, తమిళంలో, మలయాళ భాషల్లో క్రేజీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగానే ఉంది ఈ ఢిల్లీ భామ. తెలుగులో ఆమె పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on June 16, 2021 8:10 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…