నాని సినిమాలో ఐదుగురు హీరోయిన్లు!

నేచురల్ స్టార్ హీరోగా సరికొత్త కథలను ఎన్నుకుంటూ తనదైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం హీరోగా ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఓ పక్క హీరోగా బిజీగా ఉంటూనే మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ మొదలుపెట్టి అందులో టాలెంటెడ్ దర్శకులతో సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘అ!’, ‘హిట్’ లాంటి సినిమాలను రూపొందించారు. ఈ రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

ఇప్పుడు ‘మీట్ క్యూట్’ అనే మరో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో తన సోదరి దీప్తిని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు నాని. ఇదొక మల్టీస్టారర్ సినిమా అని.. కానీ హీరోలు కనిపించరని.. హీరోయిన్ల మల్టీస్టారర్ అంటూ చెప్పుకొచ్చారు నాని. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని టాక్. అందులో ముగ్గురు పేరున్న హీరోయిన్లు కాగా.. మరో ఇద్దరు కొత్తవాళ్లని తెలుస్తోంది. వీరి పేర్లను నాని బయటకు చెప్పడం లేదు.

ఒక్కొక్కరి పేరు ఒక్కోసారి ప్రకటించి.. కొత్తగా పబ్లిసిటీ చేసుకుందామని నాని ప్లాన్ చేస్తున్నారట. నెల రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్ వేసుకున్నారు. ఇది సింపుల్ గా సాగే స్టోరీ కాబట్టి భారీ సెట్ వర్క్ లు అవకాశం లేదు. అందుకే మొత్తం సెటప్ చేసుకొని షూటింగ్ కి రెడీగా ఉన్నారు. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నాని ఈ సినిమాతో పాటు ‘హిట్’కి సీక్వెల్ ను నిర్మిస్తున్నారు.