కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటంతో సినీ పరిశ్రమలో నెమ్మదిగా కదలిక వస్తోంది. లాక్ డౌన్ షరతులను సడలించి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపారాలు సహా అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి తెలంగాణలో అనుమతులు రావడంతో షూటింగ్స్ పునఃప్రారంభానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు తిరిగి సెట్స్ మీదికి వెళ్లాయి. త్వరలోనే మిగతా చిత్రాల బృందాలు కూడా సెట్స్‌లోకి అడుగు పెట్టబోతున్నాయి.
ఐతే థియేటర్లు ఎప్పటికి పునఃప్రారంభం అవుతాయి.. కొత్త సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయన్నదే తేలాల్సి ఉంది. ఈ నెలలో అయితే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. థియేటర్లపై ప్రత్యేకంగా నియంత్రణ ఏమీ లేదు. ఇప్పుడు కూడా సాయంత్రం 6 గంటల లోపు రెండు షోలు నడిపించుకోవడానికి అవకాశముంది.
కానీ జనాలు ఇప్పుడిప్పుడే థియేటర్లకు వచ్చే మూడ్‌లో లేరు. ఆక్యుపెన్సీ విషయంలోనూ క్లారిటీ లేదు. 50 శాతానికే అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఆగస్టుకు కానీ థియేటర్లు పునఃప్రారంభం కాకపోవచ్చనుకుంటున్నారు. ఐతే థియేటర్ల విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ.. ఓ కొత్త సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చేయడం విశేషం. టాలీవుడ్ అన్ లాక్-2లో భాగంగా ముందుగా విడుదల ఖరారు చేసుకున్న ఆ సినిమా.. ఎస్ఆర్ కళ్యాణమండపం.
రాజావారు రాణివారుతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం హీరోగా, ట్యాక్సీవాలా భామ ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించిన చిత్రమిది. గత ఏడాది వచ్చిన దీని టీజర్ ఆకట్టుకుంది. ఈ సినిమాను ఆగస్టు 6న రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. శంకర్ పిక్చర్స్ అనే సంస్థ ఎస్ఆర్ కళ్యాణ మండపం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను రూ.4.5 కోట్లకు కొందట. ఈ చిన్న సినిమాకు ఇది పెద్ద రేటనే చెప్పాలి. శ్రీధర్ గాదె అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రానికి స్క్రిప్టు అందించింది హీరో కిరణే కావడం విశేషం.
This post was last modified on June 14, 2021 10:32 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…