కన్నడ సినీ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బెంగుళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. జూన్ 12న తన స్నేహితుడి ఇంటికి బైక్ మీద వెళ్లిన విజయ్ తిరిగొస్తున్న సమయంలో యాక్సిడెంట్ కి గురైనట్లు సమాచారం. ఆయన తలకు, కాళ్లకు బలమైన గాయాలు తగలడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఇంకా ఆయన స్పృహలోకి రాలేదని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రముఖ న్యూరో సర్జన్ అరుణ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ సంచారి విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. యాక్సిడెంట్ కారణంగా ఆయన బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టిందని.. దీంతో సర్జరీ చేయాల్సి వచ్చిందని డాక్టర్ తెలిపారు. మరో 48 గంటల గడిచిన తరువాతే విజయ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇవ్వగలమని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విజయ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.
2011 లో విడుదలైన ‘రంగప్ప హోంగ్బిత్న’ అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు సంచారి విజయ్. ఆ తరువాత ‘దసవల’, ‘హరివూ’, ‘ఒగ్గరనే’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘సిపాయి’ లాంటి కన్నడ సినిమాల్లో నటించారు. ‘నన్ను అవనళ్ల అవలు’ అనే సినిమాలో ఆయన పెర్ఫార్మన్స్ కు నేషనల్ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఆయన నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates