ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్, యాక్టివ్ ప్రొడ్యూసర్లలో బన్నీ వాసు ఒకడు. అల్లు వారి నీడలో ఉండటం వల్ల వాసును పెద్ద నిర్మాతల జాబితాలో పెట్టరు కానీ.. నిజానికి ఆ బేనర్లో తెరకెక్కే ప్రతి సినిమాలో అతడి భాగస్వామ్యం ఉంటుంది. పైకి అల్లు అరవింద్ నిర్మాతగా కనిపిస్తారు కానీ.. ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ చూసుకునేది బన్నీ వాసే. అందుకే వాసును టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకడిగానే చూడాలి. పరిశ్రమ పోకడల గురించి మాట్లాడే స్థాయి కూడా అతడికుంది. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన బన్నీ వాసు.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినీ పరిశ్రమపై ఏ స్థాయిలో ఉంది, మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి.. థియేటర్ల పరిస్థితేంటి.. లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.
గత ఏడాది కరోనా వేవ్ నుంచి దేశంలోనే మరే పరిశ్రమా కోలుకోని విధంగా టాలీవుడ్ కోలుకుందని.. ఇక్కడ మంచి విజయాలు చూశామని, కానీ దురదృష్టవశాత్తూ సెకండ్ వేవ్ వల్ల మళ్లీ ఇండస్ట్రీ ప్రమాదంలో పడిందని బన్నీ వాసు అన్నాడు. వేసవిలో రావాల్సిన పెద్ద సినిమాలకు బ్రేక్ పడటంతో వాటి ప్రభావం ఇప్పుడు జూన్, జులై నెలల్లో రావాల్సిన సినిమాలపై పడుతోందని.. వీటికి తోడు చాలా చిన్న, మీడియం రేంజి సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయని.. రాబోయే రోజుల్లో వీటన్నింటినీ అకామొడేట్ చేయడం చాలా కష్టమవుతుందని బన్నీ వాసు అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాల మధ్య చిన్న చిత్రాలకు దారి దొరకడం కష్టమని.. కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మంచిదంటూ ఓటీటీల బాట పట్టమనే నిష్ఠుర సత్యం చెప్పేశాడు బన్నీ వాసు. తమ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, 18 పేజెస్ సినిమాల విషయంలో కూడా పరిస్థితులను బట్టి ఓటీటీల్లో రిలీజ్ చేయడం గురించి ఆలోచిస్తామని అతనన్నాడు. దసరాకు ముందు థియేటర్లు తెరుచుకునే అవకాశాలున్నాయని.. వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవాలంటే నవంబరు, డిసెంబరు వరకు ఎదురు చూడాల్సిందే అని బన్నీ వాసు స్పష్టం చేశాడు. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటే ఇంకా ఆలస్యం జరగొచ్చని అతను చెప్పాడు.
This post was last modified on June 12, 2021 9:17 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…