వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు నటుడు బ్రహ్మాజీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ హీరోగా కూడా సినిమాలు చేశారు. ఆ తరువాత విలన్ పాత్రలను సైతం పోషించారు. ఈ మధ్యకాలంలో తన పాత్రల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు బ్రహ్మాజీ. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ సినిమాలో హీరో తండ్రి పాత్రలో మెప్పించారు. ఈ పాత్ర విషయంలో ఆయనకి మంచి ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఆయనకు మరో సినిమాలో కీలకపాత్ర దక్కిందని సమాచారం.
పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే కథ ప్రకారం ఈ సినిమాలో రానాతో పాటు ఓ వ్యక్తి ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉంటారు. డ్రైవర్ పాత్ర అయినప్పటికీ రానా తన కుటుంబ సభ్యుడిలా ట్రీట్ చేసే రోల్ అది. దాదాపు రానా కనిపించే అన్ని సన్నివేశాల్లో ఈ రోల్ కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం బ్రహ్మాజీని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పాత్ర ఆయనకి మరింత పేరు తీసుకొస్తుందని బ్రహ్మాజీ ఆశిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆయనకు అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ను పూర్తి చేశారు. రానా, పవన్ మీద యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పవన్ పాల్గొనున్నారు.
This post was last modified on June 11, 2021 7:34 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…