రజినీ జపం చేస్తోన్న మెగాహీరో!

మెగా ఫ్యామిలీ హీరోలను ‘మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరని..?’ ప్రశ్నిస్తే ముందుగా మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్తారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ అంటారు. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం రజినీకాంత్ జపం చేస్తున్నారు. తనకు రజిని సర్ అంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమాను పూర్తి చేశాడు. ఆ తరువాత గిరీశయ్యతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ సమయంలో చాలా మంది స్టార్లు ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వస్తూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా పంజా వైష్ణవ్ తేజ్ కూడా లైవ్ లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలను జవాబులు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన ఫేవరెట్ హీరో రజినీకాంత్ అని.. ఇష్టమైన సినిమా ‘శివాజీ’ అంటూ రజినికాంత్ మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. అలానే పవన్ కళ్యాణ్ నుండి ఎంతో స్ఫూర్తి పొందుతుంటానని చెప్పారు.

తన ఫోన్ లో వాల్ పేపర్ ని చూపించమని ఓ నెటిజన్ అడగ్గా.. స్క్రీన్ షాట్ షేర్ చేశాడు వైష్ణవ్. అందులో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఫోటో ఉంది. దీంతో ‘సోనాక్షి అంటే అంత ఇష్టమా.?’ ఓ అభిమాని ప్రశ్నించాడు. దానికి వైష్ణవ్.. ‘ఇష్టం కాదు.. ప్రేమ’ అంటూ బదులిచ్చాడు. అనంతరం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ ‘పెద్ద అన్నయ్య’ అని, ఎన్టీఆర్ ‘వెల్ విషర్’ అని చెప్పాడు. అల్లు అర్జున్ అంటే స్టైల్ అని వరుణ్ తేజ్ కింగ్ అని చెప్పుకొచ్చారు.