టాలీవుడ్ బడా హీరోల సరసన నటించిన రాశిఖన్నా స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగచైతన్య సరసన ‘థాంక్యూ’, గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే తమిళంలో నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి కాకుండా బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సిరీస్ పై రాశి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రాశిఖన్నాకు మరో క్రేజీ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.
ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ కథను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారట. చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉండడంతో రాశి కూడా నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం.
ఈమెతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన కొందరు నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. 2023లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on June 10, 2021 5:31 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…