బాలీవుడ్ కాంట్రవర్శల్ క్వీన్ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఈ ఏడాది ఇంకా ఆదాయపు పన్ను చెల్లించలేదని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరోనా-లాక్ డౌన్ కారణంగా ఏడాదిగా షూటింగుల్లో పాల్గొనలేదని.. దీంతో సరిపడా డబ్బులు లేకపోవడంతో పూర్తి స్థాయిలో పన్ను చెల్లించలేదని ఆమె వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది.
“నా ఆదాయంలో 45 శాతం వరకూ నేను పన్ను రూపంలో చెల్లిస్తున్నాను. అత్యధిక మొత్తంలో పన్ను చెల్లించే నటిని నేను. ఐతే ఏడాదిగా ఉపాధి లేకపోవడంతో చేతిలో డబ్బులు లేక ఇంకా సగం పన్నుని చెల్లించలేకపోయాను. దీంతో అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తోంది. అయినప్పటికీ నేను అందుకు అంగీకరిస్తున్నాను. ఇలా పన్ను చెల్లించడంలో ఆలస్యం చేయడం నా జీవితంలో ఇదే తొలిసారి” అని కంగన వివరించింది.
బాలీవుడ్లో ఎవరేం తప్పు చేసినా నిలదీయడ అలవాటుగా మార్చుకున్న కంగనా.. తాను పన్ను చెల్లించకపోవడంపై ఎవరైనా కూపీ లాగి సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తారేమో అన్న అనుమానంతోనే ఇలా చేసినట్లు ఉంది. ఇటీవల ఆమె మాస్క్ లేకుండా బయట తిరగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. షూటింగుల్లేని ఈ ఏడాది కాలంలో కంగనా బోలెడన్ని వివాదాల్లో జోక్యం చేసుకుంది. ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుగా, మిగతా పార్టీలకు వ్యతిరేకంగా ఆమె చేసిన ట్వీట్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. చివరికి ఒక ట్వీట్లో శ్రుతి మించిపోవడంతో ట్విట్టర్ ఆమె అకౌంట్‌ను శాశ్వతంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on June 10, 2021 8:48 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…