భారతీయ చెస్ రంగంలో విశ్వనాథన్‌ది ఒక సువర్ణాధ్యాయం. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి భారత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన ఘన చరిత్ర ఆనంద్‌ది. తన రంగంలో ఆయనది సాటి రాని స్థాయి. ఇక భారతీయ సినీ రంగం విషయానికి వస్తే నటుడిగా ఆమిర్ ఖాన్‌ది ఒక ప్రత్యేక అధ్యాయం. తనదైన సినిమాల ఎంపికతో, అద్భుతమైన నటనతో అద్భుత విజయాలందుకునని, ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అనిపించుకున్నాడు ఆమిర్. ఈ ఇద్దరినీ ఒక ఆసక్తికర సమరంలో చూడబోతున్నాం.
ఆనంద్‌తో ఒక ఎగ్జిబిషన్ చెస్ గేమ్ ఆడబోతున్నాడు ఆమిర్. కరోనా నేపథ్యంలో ఒక ఛారిటీ కార్యక్రమంలో భాగంగా వీళ్లిద్దరూ ఈ గేమ్‌లో తలపడబోతున్నారు. చెస్.కామ్ ఇండియా విభాగం ఈ గేమ్‌ను నిర్వహించబోతోంది. ‘చెక్ మేట్ కొవిడ్’ సెలబ్రెటీ ఎడిషన్ పేరుతో ఈ పోరు జరగనుంది. జూన్ 13న సాయంత్రం 5-8 గంటల మధ్య గేమ్ జరుగుతుంది.
ఆసక్తి ఉన్న వాళ్లు చెస్.కామ్‌లోకి లాగిన్ అయి ఉచితంగా ఈ గేమ్‌ను చూడొచ్చు. కొవిడ్ బాధితుల కోసం విరాళాలు అందజేయవచ్చు. కొవిడ్ చారిటీలో భాగంగా చెస్.కామ్ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడుతోంది. ఇంతకుముందు ఆనంద్, హారిక, హంపి తదితరులతో ఒక టోర్నీ నిర్వహించారు. నిర్దిష్ట మొత్తంలో విరాళాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రముఖ క్రీడాకారులతో గేమ్‌లు ఆడే అవకాశం కల్పించారు. తద్వారా దాదాపు రూ.40 లక్షలు సేకరించారు. ఇప్పుడు ఆనంద్-ఆమిర్ గేమ్ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతాయని ఆశిస్తున్నారు.
ఆనంద్, ఆమిర్ ఇలా చెస్ గేమ్‌లో తలపడటం ఇదే తొలిసారి కాదు. 2015లోనూ వీళ్లిద్దరూ ఇలా ఓ చారిటీ కార్యక్రమంలో భాగంగానే ఎగ్జిబిషన్ గేమ్ ఆడారు. విశేషం ఏంటంటే.. ఆనంద్ మీద బయోపిక్ తీయడానికి ఈ మధ్యే సన్నాహాలు మొదలు కాగా ఆయన పాత్రను ఆమిర్‌తోనే చేయించాలనుకున్నారు నిర్మాతలు. కానీ డేట్ల సమస్య వల్ల ఈ చిత్రం చేయలేకపోయాడు ఆమిర్. దీంతో తమిళ నటుడు ధనుష్‌తో ఆనంద్ బయోపిక్ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
This post was last modified on June 9, 2021 3:10 pm
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…