Movie News

ఆరు నెలల్లో మూడు సినిమాలు!

నటి సాయిపల్లవికి తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తన నటన, డాన్స్ తో యూత్ ని ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఆమె అభిమానుల కోసం బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేయబోతుంది. రాబోయే ఆరు నెలల్లో ఆమె నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాను రిలీజ్ చేయనున్నారు. చాలాకాలంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఫస్ట్ కాపీ రెడీగా ఉన్నా.. లాక్ డౌన్ కారణంగా ఎదురుచూడాల్సిన పరిస్థితి.

థియేటర్ తెరుచుకున్న వెంటనే.. యాభై శాతం ఆక్యుపెన్సీ అయినప్పటికీ మంచి డేట్ చూసుకొని ఆగస్టు నెలలో సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా విడుదలైన కొద్ది గ్యాప్ లోనే ‘విరాటపర్వం’ సినిమా కూడా థియేటర్లోకి రాబోతుంది. రానా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఆ తరువాత రెండు, మూడు నెలల్లో ‘శ్యామ్ సింగరాయ్’ కూడా రిలీజ్ అవుతుందని అంటున్నారు.

నాని హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ లోపు విడుదల చేయాలనేది నాని ప్లాన్. ఈ సినిమా కంటే ముందుగా నాని నటించిన ‘టక్ జగదీష్’ విడుదలవుతుంది. అంటే ఈ ఏడాది నుండి నాని నుండి రెండు సినిమాలు రాబోతున్నాయన్నమాట. మరోపక్క సాయి పల్లవి నుండి ఆరు నెలల గ్యాప్ లో మూడు సినిమాల వరకు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

This post was last modified on June 9, 2021 3:04 pm

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

2 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

3 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

5 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

5 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

7 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

8 hours ago