Movie News

‘నిశ్శబ్ధం’ వీడిన కోన వెంకట్

బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద నటుడు నటించిన ‘గులాబో సితాబో’ సినిమా వచ్చే నెల నేరుగా అమేజాన్ ప్రైంలో రిలీజ్ కాబోతోంది. ఇదే బాటలో మరిన్ని పేరున్న సినిమాలను నేరుగా డిజిటల్‌లో రిలీజ్ చేసేయానికి రంగం సిద్ధమైంది. తమిళం, మలయాళంలో కూడా ఒక స్థాయి ఉన్న సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తున్నారు. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో కొంచెం పట్టుదలగా ఉన్నది తెలుగు సినీ పరిశ్రమే.

గత నెలలో ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమా ఒకటి నేరుగా ఆన్ లైన్లో రిలీజైంది కానీ.. తర్వాత మరే సినిమా సాహసం చేయలేదు. ‘వి,’ ‘రెడ్’ లాంటి సినిమాలకు మంచి ఆఫర్లు వచ్చినా వాటి నిర్మాతలు డిజిటల్ రిలీజ్‌కు నో చెప్పారు. ఐతే కోన వెంకట్ సమర్పణలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’సినిమాను డిజిటల్‌లో రిలీజ్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి.

త్వరలోనే ఈ సినిమా ఆన్ లైన్ రిలీజ్ గురించి ప్రకటన రావచ్చని ఇండస్ట్రీ చర్చ జరుగుతోంది. ఐతే కోన వెంకట్ ఈ విషయమై స్పష్టత ఇచ్చాడు. సినిమా అనేది థియేటర్ల కోసమే రూపొందుతుందని ఆయన ఓ కామెంట్ చేశారు. ‘‘మేమంతా సినీ పరిశ్రమకు ఎంతో ప్రేమతో వచ్చాం. ఎన్నో కష్టాలు పడ్డాం. మా పనికి థియేటర్లలో జనాల నుంచే వచ్చే స్పందనే మాకు ప్రేరణ ఇస్తుంది. ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఆ భావనకు మరేదీ సాటి రాదు. సినిమా అంటే థియేట్రికల్ రిలీజ్‌కు ఉద్దేశించింది. దానికే మా ప్రాధాన్యం’’ అంటూ ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కోన.

ఎక్కడా ‘నిశ్శబ్దం’ ప్రస్తావన తేలేదు కానీ.. ఆయన ప్రకటన ఆ సినిమాను ఉద్దేశించిందే అన్నది స్పష్టమైంది. ఇంత స్పష్టంగా చెప్పాక ఇక ‘నిశ్శబ్దం’ డిజిటల్ రిలీజ్ గురించి ఊహాగానాలు కట్టిపెట్టేయడం మంచిదేమో. ఈ చిత్రాన్ని ముందు జనవరి 31న.. ఆ తర్వాత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని అనుకున్నారు.

This post was last modified on May 17, 2020 8:08 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

3 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

3 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

4 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

5 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

5 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

7 hours ago